SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏపీలో ఇస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇండ్ల నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్ మాట్లాడుతూ.. ఇసుక ప్రజలకు దొరకకపోవడంతో భవన కార్మికులకు నిర్మాణ పనులు లేక కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు.