HYD: బాచుపల్లిలోని ఓ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి, కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన అనూష బాచుపల్లి చౌరస్తాలోని ఓ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. దసరాకు ఇంటికెళ్లిన ఆమెను తిరిగి తల్లిదండ్రులు ఆదివారం కాలేజీలో వదిలివెళ్లిన కొద్ది నిమిషాలకే కూతురు స్పృహ కోల్పోయిందని సిబ్బంది తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.