ADB: జిల్లాలోని జర్నలిస్టులకు సమాచార, పౌర సంబంధాల శాఖ జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డుల కాల పరిమితిని ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడగించింది. ఈ మేరకు ఆ శాఖ స్పెషల్ కమిషనర్ ఎం.హనుమంతరావు గురువారం ఉత్వర్వులు జారీ చేశారు. ఈనెల 30వ తేదీతో కార్డుల కాల పరిమితి ముగియనుండగా.. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31వ వరకు పొడగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.