»What Happened To Rahul Gandhi Is A Dark Day In The History Of Democracy Kcr
CM KCR : రాహుల్ గాంధీ పై వేటు.. ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు : సీఎం కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ (Congress party) ఎంపీ రాహుల్ గాంధీపై (Rahul Gandhi) పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) త్రీవంగా ఖండించారు.నేడు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజు అన్నారు. ప్రధాని మోదీ (PM Modi) పాలన ఎమర్జెన్సీ ని మించిపోతుందని కేసీఆర్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అన్నారు. నేరస్తులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారని కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ (Congress party) ఎంపీ రాహుల్ గాంధీపై (Rahul Gandhi) పార్లమెంట్ అనర్హత వేటు వేయడాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) త్రీవంగా ఖండించారు.నేడు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటిరోజు అన్నారు. ప్రధాని మోదీ (PM Modi) పాలన ఎమర్జెన్సీ ని మించిపోతుందని కేసీఆర్ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అన్నారు. నేరస్తులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారని కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్పై అనర్హత వేటు వేయడంపై కేసీఆర్ ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేయడమే కాకుండా, అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును(Parliament) సైతం తమ హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం.
ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జెన్సీని (Emergency) మించిపోతోంది. ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ తన పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ (BJP) ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బీజేపీ (BJP) దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి అని కేసీఆర్ తెలిపారు