TS e-Challen: తెలంగాణ(Telangana)లో పెడ్డింగ్ చలాన్లు చెల్లించమని తెలంగాణ ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. కొంద మంది దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇంకొంత మంది సైట్స్ పనిచేయడం లేదని, లేదా పనిలో ఉండి మరిచిపోయిన వారు ఉన్నారు. అలాంటి వారికోసం తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల(pending challans) ఈ నెల 31వ తేదీ వరకు చెల్లించవచ్చని, రాయితీ గడువును పొడిగించింది. తెలంగాణ వ్యాప్తంగా 3 కోట్ల 9 లక్షల పెండింగ్ చలాన్లు ఉన్నా. ఈ ఆఫర్ ఇవ్వడంతో దాదాపు 1 కోటి 7 లక్షల మంది చలాన్ల కట్టారు.
దీంతో ప్రభుత్వానికి వరకు రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ లెక్కన చూస్తే ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం సక్సెస్ అయింది. దీంతో మరింత సమయం ఇస్తే బాగుంటుందని భావించి డేట్ను పొడిగించారు. ముందు డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 10 వరకు పెండింగ్ చలాన్ల రాయితీకి అవకాశం కల్పించారు. వివిధ కారణాల వలన దాన్ని అందరూ వినియోగించుకోలేదు. దాంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.