Transgenderకు కీలక బాధ్యత.. తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ఎంపిక
ట్రాన్స్‌జెండర్ లైలాకు ఎన్నికల ప్రచారకర్త బాధ్యతలను తెలంగాణ సీఈవో అప్పగించారు. లైలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3600 మంది ట్రాన్స్జెండర్లకు నాయకత్వం వహిస్తున్నారు.
Transgender: తెలంగాణ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం దృష్టిసారించింది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ఓటర్ల జాబితాలో మార్పు చేర్పులు, ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటరు నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం ప్రచారం నిర్వహిస్తోంది. ఇందుకోసం ఈసీ సెలబ్రిటీలకు బాధ్యతలను అప్పగిస్తోంది. ఈసారి డిఫరెంట్‌గా ఆలోచించింది. అవును.. ఓ ట్రాన్స్‌జెండర్‌కు (Transgender) ఎన్నికల ప్రచారకర్త బాధ్యతలను అందజేసింది.
వరంగల్ కరీమాబాద్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ (Transgender) లైలా భుజాల మీద కీలక బాధ్యతలు ఉంచింది. లైలాతో ఓటర్ల నమోదు, జాబితాకు సంబంధించి అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3600 మంది ట్రాన్స్జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. వారి కోసం జిల్లా అధికారులతో మాట్లాడతారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వారంలో ఒకరోజు ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేయించారు.
నవంబర్-డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకు సంబంధించి ఈసీ చర్యలు చేపడుతోంది. జమిలీ, మినీ జమిలీ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. పార్లమెంట్ సమావేశాలు.. జమిలీపై కమిటీ ఏర్పాటు చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మత్రం ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను ఈసీ చేపడుతోంది.