Sarpanch Tenure : హైకోర్టు మెట్లెక్కిన సర్పంచులు.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం
తెలంగాణలో సర్పంచ్ పదవీ కాలం జనవరి 31, 2024తో ముగిసిపోయింది. అయితే సర్పంచ్ ల పదవీకాలం మరికొంత కాలం పొడిగించాలని బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకోలేదు.
Sarpanch Tenure : తెలంగాణలో సర్పంచ్ పదవీ కాలం జనవరి 31, 2024తో ముగిసిపోయింది. అయితే సర్పంచ్ ల పదవీకాలం మరికొంత కాలం పొడిగించాలని బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకోలేదు. వెంటనే ప్రత్యేక అధికారుల పాలనకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని సర్పంచులు, ఉప సర్పంచుల నుంచి రికార్డులు, చెక్‌బుక్కులు, డిజిటల్ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం తక్షణమే ఆదేశాలను జారీ చేసింది. బుధవారం నుంచి వారి వద్ద నుంచి చెక్ బుక్కులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
తాజాగా ఇదే విషయమై సర్పంచ్ లు హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని లేకపోతే ఎన్నికలు జరిగేంత వరకు తమనే సర్పంచ్ లుగా కొనసాగించాలని పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మున్సిపాలిటీ పాలక వర్గాల్లో ఫిరాయింపులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధీనంలో ఉన్న మున్సిపాలిలీలు కాంగ్రెస్ చేతికి చిక్కబోతున్నాయి. మరోవైపు సర్పంచ్ ల ఎన్నికలకు కూడా కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సర్పంచ్ ల పదవీకాలం ముగుస్తున్న సందర్భంలో ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం అన్ని బాధ్యతలను అప్పగించబోతుంది. ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి వీరందరూ విధుల్లో చేరతారు. చెక్ బుక్ లు, డిజిటల్ సంతకాలతో కూడిన పెన్ డ్రైవ్ లను వారి వద్దే ఉంచుతారు. ఇకపై ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభివృద్ధి పనులకు సంబంధించి వారిద్దరి సంతకాలతో నిధులు డ్రా చేసుకోవచ్చని తెలిపింది. తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఎంపీడీవోలను ప్రత్యేక అధికారులుగా నియమించబోతోంది ప్రభుత్వం.