»Police Arrested Two People In Kalti Ice Cream Making In Hyderabad
Ice Cream: సమ్మర్ కాదా అని ఐస్‌క్రీం తింటున్నారా?.. బీ కేర్ ఫుల్!
కల్తీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. కల్తీ వ్యాపారం చేస్తూ దండిగా డబ్బులు సంపాదిస్తున్నారు. చిన్న పిల్లలు తాగే పాలనుంచి ప్రతీ వస్తువును కల్తీ చేస్తున్నారు.
Ice Cream: కల్తీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బు కోసం ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. కల్తీ వ్యాపారం చేస్తూ దండిగా డబ్బులు(Money) సంపాదిస్తున్నారు. చిన్న పిల్లలు తాగే పాల(Milk)నుంచి ప్రతీ వస్తువును కల్తీ చేస్తున్నారు. హైదరాబాద్(Hyderabad)లో నకిలీ చాక్లెట్స్(Fake chocolate) ఘటన మరువక ముందే తాజాగా మరో బాగోతం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్(Shamshabad) పరిధిలోని ఆమనగల్ లో నకిలీ ఐస్‌క్రీం(Fake ice cream)లు తయారీ గుట్టు రట్టుచేశారు. నాణ్యత లేని ఐస్ క్రీంలు తయారు చేస్తున్న కంపెనీ(company)లను పోలీసులు గుర్తించారు. ఈ కంపెనీ సిబ్బంది అపరిశుభ్ర పరిసరాల్లో ఐస్‌క్రీంలు తయారు చేస్తున్నారు.
వాటిని తోపుడు బండ్ల వారికి విక్రయించి డబ్బు సంపాదిస్తున్నారు. అంతే కాకుండా ఐస్క్రీంలకు బ్రాండెడ్ కంపెనీ లేబుల్స్ అంటించి మార్కెట్(market)లో అమ్ముతున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు.. రెండు ఐస్‌క్రీం తయారీ పరిశ్రమలపై దాడులు నిర్వహించారు. అక్కడి తయారీ విధానాన్ని చూసిన పోలీసులు షాక్ అయ్యారు. అపరిశుభ్రమైన వాతావరణంలో ఈగలు, దోమలు ముసురుతున్న స్థలంలో ఐస్‌క్రీం(ice cream)లు తయారు చేస్తుండడంతో పోలీసులు విస్తు పోయారు. మురుగు నీటి పక్కన రసాయనాలు, రంగునీళ్లు ఉపయోగించి ఐస్‌క్రీం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. చిన్న పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఐస్‌క్రీంలు తయారు చేస్తున్న పరిశ్రమ నిర్వహకులపై కేసులు నమోదు చేసి.. రెండు ఐస్‌క్రీం తయారీ సంస్థలను పోలీసులు మూసివేశారు.