PDPL: రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు మంథని మండలం ఎక్లాస్ పూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని నారమళ్ళ రజిత ఎంపికయ్యారు. ఈ నెల 10 నుంచి హన్మకొండలో జరుగనున్న రాష్ట్ర స్థాయి 69వ ఎస్‌జీఎఫ్ బాక్సింగ్ పోటీలలో పాల్గొంటారు. 48 కేజీల విభాగంలో రజిత ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోటీలలో బంగారు బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలలో ఎంపికైనట్లు హెచ్ఎం తెలిపారు.
KMM: నగరంలోని 46వ డివిజన్లో కార్పొరేటర్ కన్నం వైష్ణవి-ప్రసన్నకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ‘ఓట్ చోర్ గద్దె చోడ్’ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ జావేద్ పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా రాహుల్ గాంధీ పనిచేస్తున్నారని, ఈ ఉద్యమానికి ఆయన పిలుపునిచ్చారని తెలిపారు.
BHNG: చేనేత సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని చేనేత జన సమాఖ్య జాతీయ అధ్యక్షుడు మాచర్ల మోహన్ రావు పిలుపునిచ్చారు. భూదాన్ పోచంపల్లిలో జిల్లా చేనేత జన సమాఖ్య ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు, చేనేత సంస్థల ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
SRPT: బీసీలను మోసం చేసేందుకే 42% రిజర్వేషన్లు కల్పిస్తామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రామా ఆడిందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉడుం కృష్ణ ఆరోపించారు. గురువారం రాత్రి ఆయన ఒక పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 22 నెలలైనా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.
BDK: కొత్తగూడెంకు చెందిన జక్కుల వెంకన్న చిట్టిల పేరుతో రూ.16, 41,000 చెల్లించకుండా మోసం చేసి పారిపోయాడని కేసు నమోదయింది. ప్రైవేటు చిట్టిలు నడిపి మోసం చేసిన వ్యక్తికి ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్టీలు వసంత్ గురువారం తీర్పు వెల్లడించారు. దోషికి ఐదేళ్ల కారాగార శిక్ష , రూ.3వేల జరిమారా విధిస్తూ తీర్పు చెప్పారు.
ADB: గుడిహత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామంలో శుక్రవారం పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో లాంప్ స్కిన్ వ్యాక్సిన్‌ను అందజేశారు. పశువులు చర్మవ్యాధితో బాధించినట్లయితే ఈ టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలన్నారు. గ్రామంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
PDPL: ప్రతి గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో విత్తన ఉత్పత్తి క్షేత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు, పాలకుర్తి మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్ తెలిపారు. పాలకుర్తి మండలం కుక్కల గూడూరులోని విత్తనోత్పత్తి క్షేత్రాలను నిన్న పరిశీలించారు. అయన మాట్లాడుతూ.. విత్తనోత్పత్తి క్షేత్రాల వాటి నుంచి వచ్చే నాణ్యమైన విత్తనాలను అదే ప్రాంతంలో వినియోగిస్తామన్నారు.
KMM: ఖమ్మం రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావుతో కలిసి రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై రైల్వే అధికారులతో సమీక్షించారు. ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం రూ.25.41 కోట్లు కేటాయించగా.. పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు.
MBNR: జడ్చర్ల మండలం కిష్టారం పోతిరెడ్డి చెరువు అలుగు ఉదృతంగా పారుతోంది. గురువారం మండల పరిధిలో భారీ వర్షాలు కురియడంతో మండలంలోని వాగులు వంకలు చెరువులు పూర్తిస్థాయిలో నిండుకుని ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. అందులో భాగంగా కిష్టారం పోతిరెడ్డి చెరువు కూడా పూర్తిస్థాయిలో నిండుకుని అలుగు పారుతోంది.
ASF: మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. జిల్లాలో 32 మద్యం షాప్‌ల కోసం అబ్కారీ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తుండగా ఈనెల 18తో గడువు ముగియనుంది. ఆసిఫాబాద్ 6 దుకాణాలకు 12 దరఖాస్తులు రాగా వాంకిడిలో 2 దుకాణాలకు 20, తీర్యాణి 1, గోయేగాంలో 1 దరఖాస్తు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 34 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
NZB: గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 74,502 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతే మొత్తంలో నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు చెప్పారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు 75,394 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా వస్తుండగా 21 గేట్ల ద్వారా 65,604 క్యూసెక్కులు వదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో తాజాగా 80.053 TMCల నీరు నిల్వ ఉంది.
NLG: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2025-26 అకాడమిక్‌లో భాగంగా ఉమ్మడి జిల్లా స్థాయి అండర్-14,17 బాల,బాలికలకు నేడు వెయిట్ లిఫ్టింగ్ సెలక్షన్ పోటీలు నిర్వహించనున్నారు. నల్గొండ పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనం పై అంతస్తులో నిర్వహించనున్నట్లు SGF కార్యదర్శి విమల తెలిపారు. ఆయా పాఠశాలల్లో వెయిట్ లిఫ్టింగ్ పై ఆసక్తి ఉన్న విద్యార్థులను పంపించాలని కోరారు.
ఖమ్మం జిల్లాలో ఇవాల్టి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన రద్దరైంది. ఈ విషయాన్నీ ఆయన పీఎస్ భాస్కర శర్మ ఓ ప్రకటనలో తెలిపారు. HYDలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రుల సమావేశం ఉన్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పర్యటనను వాయిదా వేశారు. తిరిగి Dy.Cm జిల్లా పర్యటన నూతన తేదీని త్వరలోనే ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు.
HYD: ఓల్డ్ బోయినపల్లిలోని హస్మత్ పేట్ బోయిన్ చెరువు కట్టపై సీసీ రోడ్డు నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 4న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్‌తో కలిసి రూ. కోటి వ్యయంతో ఈ పనులను ప్రారంభించారు. ఇంకా పూర్తి కాలేదు. ప్రయాణికుల రాకపోకలకు అసౌకర్యంగా మారింది. ఇకనైనా పనులు వేగవంతం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.