హైదరాబాద్(Hyderabad)కు చెందిన ఒక ఇడ్లీ(idlis) ప్రేమికుడు ఏడాది కాలంలో ఇడ్లీల కోసం కోసం రూ. 6 లక్షలు ఖర్చు చేశాడు. ఈ మేరకు ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ(swiggy) గురువారం అతని వివరాలను వెల్లడించింది. అతను సగటును రోజుకు 23 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, స్నేహితులు, అతని కుటుంబ సభ్యుల కోసం చేసిన ఆర్డర్‌లతో సహా ...
బేగంపేట (Begumpet) మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ షాపింగ్ మాల్(Shopping mall)పై జరిమాన విధించారు. ఓ కస్టమర్(Customer) నుంచి అక్రమంగా పార్కింగ్ ఫీజు రూ.10 వసూలు చేసినందుకు జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం ఆ షాపింగ్ మాల్ పై రూ.50వేల జరిమానా విధించింది.
గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై(MLA Rajasingh) ముంబైలో కేసు నమోదయ్యింది. జనవరి 29న జరిగిన సభలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్టు రాజాసింగ్ పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు అయ్యింది. ఐపీసీ సెక్షన్ 153 1(ఏ ) కింద రాజాసింగ్‌పై పోలీసులు(Police) కేసు నమోదు చేశారు. హిందూ సంఘాల సమావేశంలో రాజాసింగ్ ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీరామనవమి (Sri Rama Navami) పర్వదినం సందర్బంగా హైదరాబాద్‌లో(Hyderabad) శ్రీరాముని శోభయాత్ర అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీసులు (Police) భద్రత పెంచారు. యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభంకానున్న ఈ శోభాయత్ర సీతారామ్ బాగ్ (Sitaram Bagh) ఆలయం నుండి సుల్తాన్ బజార్ (Sultan Bazar) హనుమాన్ వ్యాయామశాల వరకు సా...
నవమి సందర్భంగా గురువారం మిథిలా స్టేడియంలో కల్యాణం కమనీయంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అభిజిత్ లగ్నం ముహూర్తంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సీతమ్మ మెడలో రామయ్య మంగళధారణ చేశారు. వేద మంత్రోచ్ఛరణలతో భద్రాద్రి క్షేత్రం ఘోషించింది.
అంబులెన్స్ ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేసి మళ్లీ ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేశారు. తెలంగాణ కళాకారుడికి ప్రభుత్వం అండగా ఉంటదని మంత్రి తన ప్రతినిధుల ద్వారా మొగిలయ్య, కొమురమ్మలకు తెలిపారు. మీకు మేమున్నాం అనే భరోసా ఇచ్చారు. మంత్రి హరీశ్ రావు స్పందనపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.
ఇది జరిగిన కొన్ని నెలల్లోనే మళ్లీ డ్రోన్ కెమెరా చిత్రీకరణ చేయడం వివాదం రాజేస్తోంది. వాస్తవంగా ఏదైనా ప్రముఖ ఆలయంపై నుంచి చిత్రీకరణ చేయవద్దు. హిందూ శాస్త్రం (Hindu) ప్రకారం ఆలయ గోపురంపై ఎలాంటి విహంగాలు సంచరించవద్దు.
షెట్కారీ సంఘటన్ కలిసి పని చేయడానికి ముందుకు రావడం కేసీఆర్ కు మరింత బలం ఇవ్వనుంది. మరి వీరి లేఖకు కేసీఆర్ స్పందిస్తారో లేదో చూడాలి. అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమయంలో వీళ్లు కలిసి వస్తామని చెప్పడంతో కేసీఆర్ వారిని స్వాగతించే అవకాశం ఉంది. త్వరలోనే ప్రగతి భవన్ కు షెట్కారీ సంఘటన్ ప్రతినిధులు రానున్నారు.
శ్రీరామ నవమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం గం.12 సమయానికి త్రేతాయుగంలో జన్మించాడు.
రెండు, మూడు సభల్లో కేసీఆర్ కుమారస్వామితో కలిసి ప్రచారం చేస్తారని కర్ణాటకలో ప్రచారం కొనసాగుతున్నది. ఇక తెలంగాణకు సరిహద్దున ఉన్న కన్నడ జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రచారం చేయనున్నారు. కాకపోతే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో (KU) ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంఘర్షణ సభకు అనుమతి ఇవ్వకపోవడంతో విద్యార్థులు వీసీ కార్యాలయం ముట్టడించేందుకు బయలు దేరారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా.. తప్పించుకుని వీసీ ఆఫీస్(VC Office) బిల్డింకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనలు చేశారు. ఈ క్రమంలోనే స్టూడెంట్స్, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
తెలుగుదేశం పార్టీ (TDP) 41వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ (Hyderabad)లో నిర్వహించిన కార్యక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన టీడీపీ 41వ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు మాట్లాడుతూ దేశానికి దశ, దిశ చూపిన వ్యక్తి పీవీ నరసింహారావు అని, పీవీ సంస్కరణల ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు.