• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

శాంతియుత ఎన్నికలకు ఫ్లాగ్‌ మార్చ్‌: సీఐ

SRPT: ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రజలకు భరోసా కల్పించేందుకు సోమవారం చివ్వేంల గ్రామంలో పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఆత్మకూరు ఎస్సైలు, స్పెషల్‌ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలు పాటించాలని, ప్రచారం సాఫీగా చేసుకోవాలని, ఫలితాల అనంతరం ఊరేగింపులు జరుపరాదని సూచించారు.

December 8, 2025 / 06:53 PM IST

ప్రభుత్వ భూముల్లో ఎర్రజెండాలు నాటుదాం: CPM

SRD: ఖాళీగా ఉన్న అమీన్పూర్ సర్వే నెంబర్ 999,1000 ప్రభుత్వ సర్వే నంబర్లలో ఎర్రజెండాలు నాటి ఇల్లు లేని నిరుపేదలకు గుడిసెలు వేయిస్తామని సీపీఎం నాయకుడు నాయి నరసింహారెడ్డి అన్నారు. ప్రభుత్వ ఖాళి భూములను చూసి పార్కింగ్‌ల పేరుతో భూ కబ్జాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయం తెలిసి కూడా రెవెన్యూ అధికారులు లంచాలకు మరిగి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

December 8, 2025 / 06:51 PM IST

జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో గోల్డ్ మెడల్

KMM: నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెం గ్రామనికి చెందిన నవీన్ (DOP) జాతీయ స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో గోల్డ్ మెడల్ దక్కింది. మొదటి నేషనల్ లెవెల్ ఫోటోగ్రఫీ నిర్వహించిన తెలుగు ఆర్ట్ ఫోటోగ్రాఫి, వివిడ్ ఫోటోగ్రఫీ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఫోటోగ్రఫీ వర్క్ షాప్‌లో గాంధారి జీవన విధాన శైలి ఛాయాచిత్రంకు గానూ అతనికి ప్రథమ బహుమతి లభించింది.

December 8, 2025 / 06:49 PM IST

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

SRD: సదాశివపేట మండలం పెద్దాపూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని ఎస్పి పరితోష్ పంకజ్ ఇవాళ పరిశీలించారు. ఈ తరుణంలోనే పోలింగ్ కేంద్రంలో చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లోని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

December 8, 2025 / 06:45 PM IST

వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించాలి: NHM ఉద్యోగులు

WGL: పట్టణానికి చెందిన NHM ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు ఆగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ NHM ఉద్యోగులు నితిన్ రెడ్డి, సంజయ్, DMHOను కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ఈ నెల 6 నుంచి ఆన్‌లైన్ సేవలు నిలిపి, నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తున్నామని ఇప్పటికైనా పెండింగ్ జీతాలు చెల్లించాలని కోరారు

December 8, 2025 / 06:44 PM IST

చక్రేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తమిళనాడు ఐజీ

NZB: బోధన్ పట్టణంలోని చారిత్రక శ్రీ ఏకచక్రేశ్వరాలయాన్ని సోమవారం తమిళనాడుకు చెందిన ఐజీ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఆయన సతీసమేతంగా స్వామివారిని దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ శర్మను అడిగి ఆలయ విశిష్టత, చరిత్ర గురించి ఐజీ తెలుసుకున్నారు.

December 8, 2025 / 06:42 PM IST

నిషేధిత పాలిథిన్ సంచులను వినియోగిస్తే భారీ జరిమానా: మేయర్

KMM: ఖమ్మం నగరంలో పాలిథిన్ సంచుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఖమ్మం నగర మేయర్ నీరజ కోరారు. వాటి స్థానంలో బయోడీగ్రేడబుల్ సంచులను పంపిణీ చేయనున్నట్లు ఆమె సోమవారం వెల్లడించారు. ఈనెల 15 నుంచి నిషేధిత పాలిథిన్ సంచులను వినియోగిస్తే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

December 8, 2025 / 06:40 PM IST

“నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి”

NLG: ప్రతి ఒక్కరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఐ నాగరాజు, ఎస్సై మామిడి రవికుమార్ అన్నారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో సోమవారం గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా అవగాహన సమావేశం నిర్వహించారు. గ్రామంలోని ప్రజలకు ఓటు విలువ, ఎన్నికల గురించి వారు తెలియజేస్తూ గ్రామ ప్రజలు స్నేహభావంతో మెలగాలని సూచించారు.

December 8, 2025 / 06:40 PM IST

‘అవినీతి రహిత అభివృద్ధే లక్ష్యం’

NZB: అర్బన్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా గత రెండేళ్లలో సుమారు రూ.130 కోట్ల నిధులు తీసుకురావడంలో విజయం సాధించానని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు.పెండింగ్లో ఉన్న కీలక ప్రాజెక్టుల పూర్తికి ఈ నిధులు మంజూరయ్యాయని, నియోజకవర్గ అభివృద్ధి సీఎంకు నిరంతరం లేఖలురాయడం అసెంబ్లీలో డిమాండ్ చేయడం ద్వారా నిధులను సాధించినట్లు ఎమ్మెల్యే వివరించారు.

December 8, 2025 / 06:40 PM IST

ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించిన పరిశీలకులు

SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎంపీడీవో, గ్రామ పంచాయతీ కార్యాలయాలను జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ సోమవారం తనిఖీ చేశారు. ఎల్లారెడ్డిపేట ఎంపీడీవో, వెంకటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాలను పరిశీలించారు. అక్కడ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి నవీన్, భారతి, ఎంపీడీవో సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

December 8, 2025 / 06:39 PM IST

‘ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి’

BDK: పంచాయతీ ఎన్నికల సంపూర్ణ ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన చండుగొండ మండలంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సంతకం స్పష్టంగా ఉండాలని సూచించారు.

December 8, 2025 / 06:39 PM IST

గుండెపోటుతో ఉపాధ్యాయుడు హఠాన్మరణం

BDK: జిల్లాలో TSUTF విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో అశ్వారావుపేట మండలంలో MPUPS దురదపాడు పాఠశాలలో SA ఫిజిక్స్ బోధించే కట్ట మధు అనే ఉపాధ్యాయుడు TSUTF మహాసభలలో పాల్గొన్నాడు. సమావేశం మొదలైన కొద్ది సేపటికే ఆయన గుండెపోటుతో హఠాన్మరణం పొందాడు. దీంతో ఉపాధ్యాయ వర్గం శోక సంద్రంలో మునిగింది.

December 8, 2025 / 06:39 PM IST

HYDలో ఏ రోడ్లకు ఎవరి పేర్లు..అసలేంటి..?

HYDలో పలు రోడ్లకు, జంక్షన్లకు ప్రముఖుల పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించినట్లు IPR డిపార్ట్మెంట్ తెలిపింది. ORR రావిర్యాల నుంచి 100M గ్రీన్ ఫీల్డ్ రహదారి ఫ్యూచర్ సిటీకి రతన్ టాటా ఇంటర్ చేంజ్, HYD US కాన్సులేట్ రోడ్డుకు డోనాల్డ్ అవెన్యూ రోడ్డుగా ప్రతిపాదించారు. అంతేకాక.. త్వరలో గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్డు, విప్రో జంక్షన్ లాంటి పేర్లు పెట్టనుంది.

December 8, 2025 / 06:35 PM IST

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీలతో సరిపెట్టాయి: మాజీమంత్రి

MHBD: డోర్నకల్, కురవి మండల కేంద్రంలో ఇవాళ సాయంత్రం BRS నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు హామీలతో సరిపెట్టాయని, కళ్యాణలక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు ఆమడ దూరమయ్యాయని విమర్శించారు. BRS పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

December 8, 2025 / 06:34 PM IST

ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన వైద్య అధికారి

KNR: తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్. వెంకటరమణ, డీపీవో ఎన్‌హెచ్‌ఎం స్వామితో కలిసి తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్, అవుట్ పేషెంట్ రిజిస్టర్‌లను ఇతర రికార్డులను వెరిఫై చేశారు. ఎన్‌సీడీ క్లినిక్‌లో అసంక్రామిత వ్యాధిగ్రస్తుల వివరాల నమోదును పరిశీలించి వారికి మందులు ఇస్తున్న తీరును పరిశీలించారు.

December 8, 2025 / 06:32 PM IST