MNCL: మందమర్రి సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు 3 నెలల ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. సింగరేణి ఉద్యోగుల, మాజీ ఉద్యోగుల భార్యలు చుట్టుపక్కల గ్రామాల మహిళలు డిసెంబర్ 9-15 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
MDK: ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టులు, పాంప్లెంట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్ల కోసం ఎంసీఎంసీ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఎన్నికల పరిశీలకులు భారతి లక్‌పతి నాయక్ సూచించారు. అదనపు కలెక్టర్ చాంబర్‌లో ఎంసీఎంసీ సభ్యులు డీపీఆర్‌వో రామచంద్ర రాజు, ఎన్ఐసీ సందీప్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ మురళీధర్‌తో సమీక్షించారు.
SRCL: ప్రభుత్వ వైద్య సేవలు విస్తృతంగా అందించాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు ఇచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ పని తీరుపై కలెక్టరేట్ కార్యాలయంలో ఇంఛార్జ్ కలెక్టర్ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇంఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీల ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.
NZB: వేల్పూర్‌లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇండ్లే లక్ష్యంగా దోపిడీకి పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. వేల్పూర్ కి చెందిన మంగళి సుదర్శన్ సోమవారం ఇంటికి తాళం వేసి కుటుంబంతో ఊరికి వెళ్ళాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న సుమారు 8 తులాల బంగారం, నగదు దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఈ సమచారం పోలీసులకు ఇవ్వడంతో కేసు నమేదు చేశారు.
BDK: జిల్లాలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో ఈ నెల 9వ తేదీన తలపెట్టిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేడు కలెక్టర్ జితేష్ వి పాటిల్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 10 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
NRML: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లను చేస్తున్నామని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికలు నిర్వహించే అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ADB: ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ఇచ్చోడ గ్రామంలోని నవేగాం గ్రామంలో సోమవారం రాత్రి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు.
NLG: తంజావూర్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్-2025, గుజరాత్‌లో కేంద్ర యువజన & క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహించిన వెస్ట్ జోన్ ఎన్ఎస్ఎస్ ప్రీ రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్-2025ల్లో ఎంకేఆర్ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ఏటెల్లి మహేందర్ ప్రతిభ చూపించి శిక్షణ పూర్తి చేశాడు. ప్రిన్సిపాల్ డా. రమావత్ రవి సర్టిఫికెట్ అందజేసి అభినందించారు.
MDK: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తెలిపారు. పాపన్నపేట మండల పరిధిలోని గాంధారిపల్లి, జయపురం, అబ్లాపూర్, అన్నారం, ఆరెపల్లి, కుర్తివాడ, దౌలపూర్, పాత లింగాయిపల్లి, కొత్త లింగాయిపల్లి, కొంపల్లి, తమ్మాయిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరఫున ప్రచారంనిర్వహించారు.
KMM: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు సాధించేవరకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నిరంతరం పోరాడుతుందని ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య స్పష్టం చేశారు. సోమవారం ఖమ్మంలోని కోణార్క్ హోటల్‌లో సంతోష్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు.
PDPL: కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని AIFTU రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై.మల్లేష్, జీ.అంజయ్యలు డిమాండ్ చేశారు. ఇవాళ AIFTU రాష్ట్ర కమిటీ సమావేశం గోదావరిఖనిలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 29 పాత కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలన్నారు.
WNP: ఎన్నికలలో పోటీచేసే ప్రతి అభ్యర్థి గెలుపు, ఓటమిలతో సంబంధం లేకుండా ఖర్చు వివరాలు తెలపాలని ఎన్నికల వ్యయపరిశీలకులు శ్రీనివాసులు స్పష్టంచేశారు. రెండవ విడత జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల అభ్యర్థుల ఖర్చు రిజిస్టర్లను మొదటి విడత సోమవారం ఆయన పరిశీలించారు. ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ప్రతి అభ్యర్థికి సంబంధిచిన ఎన్నికల ఖర్చులు మూడు సార్లు పరిశీలిస్తామన్నారు.
KMR: ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా డోంగ్లి మండలంలోని సిర్పూర్ మండల సరిహద్దులో ఎన్నికల తనిఖీల చెక్ పోస్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ చెక్‌పోస్టును బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టు నిర్వహణలో ఉన్న అధికారులకు పకడ్బందీ ఆదేశాలు జారీ చేశారు.
NZB: ఆలూరు మండలంలో 11 గ్రామాలలో స్థానాలకు చెల్లుబాటయే నామినేషన్లు 42 (సర్పంచ్), 264 (వార్డు సభ్యులు) ఉన్నాయని MPDO గంగాధర్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందన్నారు. అ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల చేయబడుతుందన్నారు. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరుగుతుందన్నారు.
KNR: ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురి కాకుండా తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా వినియోగించుకోవాలని హుజురాబాద్ ఏసీపీ మాధవి అన్నారు. కేశవపట్నంలో పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ల అనుమతి లేదని, గెలిచిన రోజు విజయోత్సవాలకు అనుమతి లేదన్నారు. డిసెంబర్ 18 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని తెలిపారు.