• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

DKS మెజార్టీ మించాలె.. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం: రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతుందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

November 6, 2023 / 07:11 PM IST

Congress సీపీఐ మధ్య కుదిరిన పొత్తు

కాంగ్రెస్- సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. కొత్తగూడెం ఒక సీటు ఇస్తామని.. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ ఇస్తామని టీ పీసీసీ చీఫ్ రేవంత్ చెప్పగా.. కమ్యూనిస్ట్ నేతలు అంగీకరించారు.

November 6, 2023 / 06:06 PM IST

Bandi Sanjay వ్యక్తి కాదు మహా శక్తి: రాజా సింగ్

మంత్రి గంగుల కమలాకర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్‌లో భూమి కబ్జా, ఇసుక దోపిడీ చేశారని ఆరోపించారు.

November 6, 2023 / 03:58 PM IST

Etala Rajender : సీఎం కేసీఆర్ భూదందాలకు పాల్పడుతున్నారు : ఈటల

సీఎం కేసీఆర్ భూ దందాలకు పాల్పడుతున్నారని.. అసైన్డ్ భూములను కబ్జా చేశారని బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రెస్ క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు

November 6, 2023 / 02:24 PM IST

CM KCR హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో తిరిగి దానిని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తిరిగి ల్యాండ్ చేశారు.

November 6, 2023 / 01:44 PM IST

Telangana బీజేపీ మేనిఫెస్టో రెడీ..12 లేదా 13న రిలీజ్ !

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో బీజేపీ స్పీడ్‌ పెంచింది. కీలక నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు.. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.

November 6, 2023 / 01:25 PM IST

KCR CAR: షాకింగ్ న్యూస్.. కేసీఆర్ కారు సీజ్

పోలీసులు కేసీఆర్ ఎన్నికల సింబల్ అయిన అంబాసిడర్ కారును సీజ్ చేశారు. ఎంటి ఆశ్చర్యంగా ఉందా ఇది నిజం. అసలు విషయం ఏంటంటే కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా టీ-కాంగ్రెస్ రూపొందించిన గులాబీ కారు.. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.

November 6, 2023 / 12:35 PM IST

Charminar ఎమ్మెల్యే ముంతాజ్‌పై కేసు నమోదు..ఎన్నికల కోడ్ ఉల్లంఘన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్న వేళ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌పై కేసు నమోదయ్యింది.

November 6, 2023 / 10:59 AM IST

Hyderabad Metro: సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్ మెట్రో

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒకే రోజులో ప్రయాణించే మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది.

November 6, 2023 / 10:34 AM IST

Rain Alert : తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని తెలిపింది.

November 6, 2023 / 10:03 AM IST

PM Modi: రేపు హైదరాబాద్‌కు రానున్న మోడీ.. ఎల్ బి స్టేడియంలో బీజేపీ బీసీ గర్జన సభ

రేపు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. రేపు భారీ సభ నిర్వహించేందుకు బీజేపీ అధిష్టానం సమాయత్తమవుతోంది. రేపు సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ గర్జన సభ నిర్వహించనుంది.

November 6, 2023 / 09:44 AM IST

Congress Party: 60 మంది అభ్యర్థులకు బీ-ఫాం అందజేసిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలోని 60 మంది అభ్యర్థులకు బీ-ఫాంలను అందించింది. నవంబర్ 10వ తేది వరకూ నామినేషన్లకు గడువు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ 100 మంది అభ్యర్థులను ప్రకటించగా మరో 19 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసి త్వరలో ప్రకటించనుంది.

November 5, 2023 / 08:01 PM IST

Bandi Sanjay: 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ నిధులు..రేవంత్ బకరా

టీపీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో బకరా కాబోతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 50 మంది ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. ఆయా నేతలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి మారతారని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

November 5, 2023 / 04:04 PM IST

CM KCR: ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు.. కొత్తగూడెం ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్

ఎన్నికల సమయంలో ప్రజలు మోసపోవద్దని, అభ్యర్థిని చూసి కాకుండా ఆ పార్టీ చరిత్రలను చూసి ఓటేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. కొత్తగూడ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్లొని ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటైన 10 ఏళ్లలో బీఆర్ఎస్ అన్ని రంగాలను ముందుకు తీసుకొచ్చిందన్నారు. ఆగమాగం కాకుండా ఆలోచించి ఓట్లేసి మళ్లీ బీఆర్ఎస్‌నే అధికారంలోకి తీసుకురావాలన్నారు.

November 5, 2023 / 03:59 PM IST

Kishan Reddy: హామీలు అమలు చేయకపోవడం, మోసం చేయడం KCRకు అలవాటే

తెలంగాణలో సీఎం కేసీఆర్ మాటలను ఇకపై ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికే కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేసే రెండు స్థానాల్లో చిత్తుగా ఓడిపోతాడని కిషన్ రెడ్డి అన్నారు.

November 5, 2023 / 01:44 PM IST