ఔటర్ రింగ్ రోడ్డు(ORR)పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.రేవంత్‌రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) లీగల్ నోటీసులు పంపింది. ORR లీజుపై నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికింది.
హైదరాబాద్ కు అవినాశ్ రావడంతో మరి సీబీఐ అధికారులు ఏం చేస్తారో తెలియాల్సి ఉంది. వారం రోజులుగా విచారణకు రాకుండా కర్నూలులో తిష్టవేసిన అవినాశ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆసక్తికరంగా మారింది.
అవినాశ్‌రెడ్డి (Avinash Reddy) లాయర్‌కు ఎంత టైం ఇచ్చారో తమ లాయర్‌కు అంత సమయం ఇవ్వాలని సునీత లాయర్లు జడ్జిని కోరారు. జడ్జిఎవరి లిమిట్స్‌లో వారు ఉండాలని హెచ్చారించారు
తెలంగాణ (Telangana) లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతోందని వచ్చే ఎన్నికల్లో మూడో సారి అధికారాన్ని చేపట్టబోతోందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.
గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చిన వీరిద్దరూ మరోసారి పర్యటించనున్నారు. ప్రగతి భవన్ లో ముగ్గురు ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. వీటితో పాటు పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం, జాతీయ రాజకీయాలు, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు వంటి వాటిపై చర్చించే అవకాశం ఉంది.
ఈ సమావేశాలకు రానుపోను ఖర్చు వృథా తప్పా అంతకుమించి ఏమీ జరగదని కొట్టిపారేశారు. సహకార సమాఖ్యకు విలువ లేనప్పుడు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకావడం హాస్యమే అవుతుందని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
రాముడి రూపంలో ప్రభాస్, వెంకటేశ్వరుని రూపంలో సుమన్, శివుని రూపంలో చిరంజీవి విగ్రహాన్ని పెడతారా అని కరాటే కళ్యాణి ప్రశ్నించారు. తనపై మా విధించిన సస్పెన్షన్ బాధ కలిగించిందని తెలిపారు.