గతంలో రెండు సార్లు ప్రధాని పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఏం జరిగినా ఈసారి ప్రధాని పర్యటన తప్పక ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టుబట్టారు.
బండి సంజయ్ కు హన్మకొండ మొదటి సెషన్స్ కోర్టు జడ్జి రెండు వారాల రిమాండ్ విధించారు. ఆయన తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ రాకుంటే ఖమ్మం జైలుకు తరలించవచ్చు.
హైదరాబాద్‌లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. బలంగా ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలిలో వర్ష ప్రభావం ఉంది.
పదో తరగతి హిందీ పేపర్ లీక్‌కు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఓ టీవీ డిబెట్‌లో మాట్లాడారు. ఈటల రాజేందర్‌కు కూడా కొశ్చన్ పేపర్ వచ్చిందని అడగగా.. తనకు మొబైల్‌లో ఎర్ర బటన్, పచ్చ బటన్ మాత్రమే తెలుసు అని తెలిపారు.
సీబీఐ, ఈడీలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా పద్నాలుగు విపక్ష పార్టీలకు సుప్రీం కోర్టులో భారీ షాక్ తగిలింది.
రాష్ట్రంలో మొన్న జరిగిన TSPSC గ్రూప్ 1 పరీక్ష సహా అనేక ఎగ్జామ్స్ లీక్ చేసిన కేసుల్లో కేసీఆర్(KCR) ఫ్యామీలీ హస్తం ఉందని విజయ శాంతి(Vijay Shanti) ఆరోపించారు. వాళ్లు చేసిన తప్పులను పక్కదారి పట్టించేందుకే కొత్తగా ఈ నాటకం ఆడుతున్నారని ఆమె అన్నారు. ఇంకా కేసీఆర్ లక్ష కోట్ల సంపాదన గురించి కూడా ప్రస్తావించారు.
తెలంగాణలో సంచలనంగా మారిన టెన్త్ హిందీ పేపర్ లీక్ కేసులో పోలీసులు బండి సంజయ్ ని ఏ1గా రిమాండ్ రిపోర్టులో ప్రకటించారు. ఏ2గా ప్రశాంత్, ఏ3 మహేష్, ఏ4 శివగణేష్ గా పేర్కొన్నారు.
Hanuman Jayanthi : హనుమాన్ జయంతి సందర్భంగా రేపు హైదరాబాద్ నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హనుమాన్ శోభయాత్రకు ఇప్పటికే హిందూ సంఘాలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
మనమంతా పదో తరగతి పరీక్షలు రాసే ఇక్కడకు వచ్చామని, పరీక్ష ప్రారంభమైన రెండున్నర గంటల తర్వాత బండి సంజయ్ వాట్సాప్ కు ప్రశ్నాపత్రం వచ్చిందని, కానీ అరగంటలో అది లీక్ కావడం ఏమిటని రఘునందన రావు ప్రశ్నించారు.