MDK: భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన అత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. భారతదేశం ఆర్థికవేత్త, నిరాడంబరి ఒక గొప్ప మహోన్నత వ్యక్తిని కొల్పొయం అన్నారు.
ADB: జిల్లా కేంద్రంలోని తిరుపల్లి సమీపంలో ఆగిపోయిన పాత జాతీయ రహదారి నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు. శుక్రవారం రహదారి నిర్మాణంతో ఇళ్లను కోల్పోతున్న వారితో ఆయన మాట్లాడారు. రోడ్డు నిర్మాణంతో పట్టణ అభివృద్ధితో పాటు ప్రయాణికులకు మేలు జరుగుతుందన్నారు. ఇళ్ల యజమానులు ముందుకు వస్తే రావలసిన నష్టపరిహారం వచ్చేలా కృషి చేస్తానన్నారు.
JN: రఘనాథపల్లి మండలం శ్రీమన్నారాయణపురం గ్రామంలోని రైతులకు జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో గిడ్డంగుల్లో నిలువ చేసిన వ్యవసాయ ఉత్పత్తులపై, రుణాల పథకాలపై శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ పి.జ్యోతి మాట్లాడుతూ.. మార్కెట్లో ధర లేనపుడు గిడ్డంగుల్లో నిల్వ చేసుకొని 7 నుంచి 8 శాతం వడ్డీతో ఋణం పొందవచ్చు అన్నారు.
NLG: నల్గొండ జిల్లాలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి డిమాండ్ చేశారు. శుక్రవారం ఐద్వా నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ బస్టాండ్‌లో సంతకాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ అనురాధ, జిట్ట సరోజ, తదితరులు పాల్గొన్నారు.
NLG: దేశ రాజకీయ చిత్రపటంలో తనదైన ముద్ర వేసిన నిజ ప్రజానాయకుడు భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

KMM: వేంసూర్ మండలం మర్లపాడు గ్రామంలో బిలీవర్స్ చర్చ్ నందు శుక్రవారం మండల పాస్టర్ అసోసియేషన్ వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రేమ విందు కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, MRO పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లాలో సంచలనం రేపిన బిక్కనూర్ ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి మిస్టరీ కేసు దర్యాప్తు అధికారిగా సదాశివనగర్ సీఐ. సంతోష్ కుమార్‌కు జిల్లా ఎస్పీ సింధుశర్మ బాధ్యతలు అప్పగించారు. ఇంతే కాకుండా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. వాట్సాప్ చాటింగ్లను పరిశీలించే పనిలో ఈ టీం ఉన్నట్లు సమాచారం.
KMR: బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చందర్ సెట్ తండ్రి ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే శుక్రవారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటుందని అన్నారు. ఆయన వెంట మండల బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.