KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 3 రోజులు సెలవులు ప్రకటించినట్లు కార్యదర్శి మల్లేశం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28న(శనివారం) వారాంతపు సెలవు, 29న(ఆదివారం) సాధారణ సెలవు, 30న(సోమవారం) అమావాస్య సందర్భంగా సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 31(మంగళవారం) నుంచి క్రయవిక్రయాలు తిరిగి ప్రారంభమవుతాయన్నారు. రైతులు, వ్యాపారులు గమనించాలని కోరారు.
NZB: ఎమ్మెల్సీ కవిత ఈనెల 29న నిజామాబాదు వస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. 29న ఉదయం HYD నుంచి బయలుదేరి నిజామాబాద్‌కు చేరుకుంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలో డిచ్‌పల్లి వద్ద BRS పార్టీ నాయకులు ఘన స్వాగతం పలుకుతారని తెలిపారు. అనంతరం బైపాస్ రోడ్డు మీదుగా సుభాశ్‌నగర్ SFS సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు.
భువనగిరి: ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రేవంత్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళితే భువనగిరికి చెందిన రేవంత్ అమీర్ పేట్‌లో టెక్నికల్‌లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా రాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఔషాపూర్ సమీపంలో శిరిడి ఎక్స్‌ప్రెస్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
KMR: మాచారెడ్డి మండల కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షుడు మహమ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు తెలిపారు. రక్తదాన శిబిరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుందన్నారు.
KMM: ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 28, 29 తేదీల్లో వారాంతపు సెలవులు కాగా, 30వ తేదీన అమావాస్య సందర్భంగా సెలవులు ప్రకటించడం జరిగిందని చెప్పారు. తిరిగి ఈనెల 31 నుంచి మార్కెట్‌లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు.
కామారెడ్డి: జహీరాబాద్ పట్టణానికి చెందిన చిద్రి ఉమా హనుమాన్ గుప్తా కుమార్తె చిద్రి లిఖిత CA తుది ఫలితాలలో జాతీయస్థాయిలో 37వ ర్యాంకు సాధించింది. శుక్రవారం MLA క్యాంపు కార్యాలయంలో లిఖితను MLA మాణిక్ రావు సన్మానించి అభినందనలు తెలిపారు. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జహీరాబాద్‌కు గర్వకారణమని MLA అన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
SRD: ఆందోలు మండలం అన్నాసాగర్ 133 కేవీ సబ్ స్టేషన్లో మరమ్మత్తుల కారణంగా ఈనెల 28న విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఈ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. జోగిపేట, చిట్కుల్, గడి పెద్దాపూర్, డాకూర్, లక్ష్మీసాగర్ గ్రామాల పరిధిలో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని చెప్పారు. ప్రజలు సహకరించాలని ఏఈ కోరారు.
WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో శుక్రవారం రాత్రి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ రావు మాట్లాడుతూ.. మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు మరువలేనివని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
PDPL: టీబీ రహిత సమాజమే లక్ష్యమని జిల్లా టీబీ చికిత్స సీనియర్ పర్యవేక్షకులు దేవ తిరుపతి తెలిపారు. శుక్రవారం పెద్దపల్లి మండలం రాఘవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొత్తపల్లిలో ప్రభుత్వం నిక్షయ్ శిబిర్ 100 రోజుల పథకంలో భాగంగా టీబీ శిబిరాన్ని నిర్వహించారు. వ్యాధిగ్రస్తులకు స్క్రీనింగ్ పరీక్షలు, లక్షణాలున్న వారి కఫం సేకరించి పరీక్షలు చేశారు.
BHPL: భూపాలపల్లి పోలీస్ స్టేషన్ను డీఎస్పీ సంపత్ రావు సంపత్ రావు శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులను సత్యరమే పరిష్కరించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలలో పోలీస్ గ్రామాధికారులను నియమించుకోవాలని సూచించారు.
MDK: నంగునూరు మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. వారు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అకాల మరణం పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మన్మోహన్ సింగ్ దేశానికి అనేక సేవా కార్యక్రమాలను చేశారని స్మరించుకుంటూ, ఆయన మరణం దేశానికి తీరని లోటని గుర్తు చేశారు.
JN: తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ కలెక్టరేట్ వద్ద చేస్తున్న సమ్మె నేటికీ 18వ రోజుకు చేరుకుంది. నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి సమస్యను పరిష్కరించాలన్నారు.
BDK: ములకలపల్లి మండలం వేముకుంట గ్రామానికి చెందిన కొందరు శనివారం ఊరు బయట చింత చెట్టు క్రింద పేకాట ఆడుతుండగా ములకలపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఒక సెల్ ఫోన్, మూడు వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కిన్నెర రాజశేఖర్ తెలిపారు.
NGKL: భారత మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఢిల్లీలోని ఆయన నివాసంలో పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం మాజీ ప్రధాని కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను జూపల్లి కొనియాడారు.
BHPL: కాటారం మండలం ఇప్పలగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన డొంగిరి బుచ్చయ్య (55)కు మరో వ్యక్తితో ఈ మధ్య భూ వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ ఏర్పడి కర్రలతో దాడి చేసుకోగా.. బుచ్చయ్య తలకు తీవ్ర గాయమైంది. దీంతో బుచ్చయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.