JGL: మెట్‌పల్లి మండలం వేంపేట గ్రామంలో శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేకుర్తి కంటి వైద్య నిపుణులు 300ల మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్, కంటి వైద్య నిపుణులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
ADB: జైనూర్ మండలంలోని లెండిగూడ గ్రామంలోని ప్రజలకు శుక్రవారం ఎఫ్ఆర్ఓ మజారుద్దీన్ అటవీ సంరక్షణపై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. జిల్లా అటవీ శాఖ అధికారి ఆదేశానుసారం మారుమూల గ్రామాల్లోని ప్రజలకు అటవీ చట్టాలు, అటవీ సంరక్షణపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రజలు అడవులు కాపాడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
PDPL: ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ అన్నారు. శుక్రవారం గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు వివిధ సమస్యలను విన్నవించేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు. వివిధ గ్రామాలు, పట్టణ ప్రాంతాల డివిజన్లకు సంబంధించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.
NLG: మర్రిగూడ మండల కేంద్రంలో కొనసాగుతున్న ఫ్లోరోసిస్ సర్వేను శుక్రవారం మర్రిగూడ పీహెచ్‌సీ వైద్యాధికారి శాలిని, వైద్యుడు దీపక్ పరిశీలించారు. ఈ సందర్బంగా పలువురు ఫ్లోరోసిస్ బాధితులను పరీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నేటి వరకు 18,134 మందిని పరీక్షించామమన్నారు. 79 మంది గర్భిణుల్లో 20 మంది నుంచి యూరిన్ శాంపిళ్లు సేకరించామని తెలిపారు.
JGL: కథలాపూర్ మండలం కలిగొట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు, చెందిన పూర్వ విద్యార్థి రాకేష్, జిరాక్స్ మిషన్, ప్రింటర్‌ను వితరణ చేశారు. చదువుకున్న పాఠశాలకు ఏదైనా వస్తువు అందించాలని ఉద్దేశంతో ప్రింటర్, జిరాక్స్ మిషన్ అందించినట్లు రాకేశ్ తెలిపారు. ఈ సందర్భంగా రాకేశ్ ను పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.
WGL: పెద్ద పులులకు ఎలాంటి హాని తలపెట్టకుండా వాటి సంచార విషయాన్ని వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాలని నర్సంపేట ఎఫ్ఆర్ఓ రవి కిరణ్ కోరారు. శుక్రవారం రుద్రగూడెంలో ఆయన మాట్లాడారు. పెద్ద పులులకు హాని తల పెడితే చట్టపర చర్యలు తప్పమన్నారు. పశువులు, సాదు జంతువులు, మనుషులకు పెద్ద పులులతో హాని జరిగితే నష్ట పరిహారం అందుతుందని, వెంటనే సమాచారం అందించారు.
NZB: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మాక్లూర్ పోలీస్టే స్టేషన్ పరిధిలో చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కారం మహేందర్ కొత్త ఇల్లు కట్టుకోవడానికి అప్పుచేశాడు. శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI తెలిపారు.
KNR: జిల్లా కేంద్రంలోని అఖిల్ అనే వ్యాపారికి, చెందిన రూ 6 లక్షలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. వాట్సాప్‌లో ఒక లింకు రావడంతో ఓపెన్ చేస్తే టెలిగ్రామ్ లింకు ఓపెన్ అయిందని, 1000 రూపాయలు కడితే 1500 వస్తాయని ఆశ చూపితే అమౌంట్ పెంచుకుంటూ పోయానని, అలా 6 లక్షలు కట్టిన తర్వాత, నాకు మళ్ళీ పైసలు రాలేదని, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు.
BDK: పాల్వంచ మండలం జగన్నాధపురం శ్రీ కనకదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శుక్రవారం వైభవంగా ముగిసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. మూడవరోజు కార్యక్రమాల్లో భాగంగా గణపతి పూజ, కర్మణః పుణ్యా: వచనం, పూర్ణహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
KMM: పల్లెగూడెం-మంగళగూడెం బీటీ రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు తెలిపారు. పనులను వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించిన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అలాగే గోళ్ళపాడు- తీర్థాల, పల్లెగూడెం – గోళ్ళపాడు మార్గంలో ఇప్పటివరకు పనులను ప్రారంభించలేదన్నారు. R&B అధికారులు, పొంగులేటి దృష్టి సారించి పనులు పూర్తి చేయలన్నారు.
నిజామాబాద్: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్సాపల్లిలో శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు మృతిచెందారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్సాపల్లి నుంచి మిర్దాపల్లికి ఇటుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఓ మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
NLG: శాంతి భద్రతల విషయంలో పోలీసులు రాజీ పడొద్దు అని DSP శివరామిరెడ్డి తెలిపారు. శుక్రవారం శాలిగౌరారం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. అక్రమ ఇసుక రవాణాను నివారించాలని, ఫిర్యాదు దారుల పట్ల పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, పెండింగ్ కేసులను పరిష్కరించాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో CI కొండల్ రెడ్డి, SI సైదులు, తదితరులు పాల్గొన్నారు.
ASF: ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ గత 18రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఆసిఫాబాద్, మంచిర్యాల BJP జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, రఘునాథ్ సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చినా రెగ్యులరైజ్ చేయలేదన్నారు.
PDPL: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి అన్నారు. మల్హర్ రావు మండలంలోని కొయ్యూరు పోలీస్ స్టేషన్‌ను కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సందర్శించారు. కార్యాలయంలోని పలు రికార్డులను డీఎస్పీ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌కి వచ్చే వారి పట్ల, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
మెదక్: జిల్లాలోని మిషనరీ పాఠశాలలకు క్రిస్మస్ పండుగ సందర్భంగా 23 నుంచి 27 వరకు సెలవులు ప్రకటించారు. దీంతో సెలవులు నిన్నటితో ముగియనున్నాయని తిరిగి ఇవాల్టి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విషయాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమనించాలని పేర్కొన్నారు.