MBNR: మార్చి 5 నుంచి 25 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నిర్వహించాలంటూ కలెక్టర్ విజయేంద్రబోయి అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలన్నారు.
NRPT: డయల్ యువర్ డీఎం కార్యక్రమం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. కోస్గి, నారాయణపేట డిపో పరిధిలోని ప్రయాణికులు, ప్రజలు ఆర్టీసీ సేవలు, బస్సు సర్వీసులు, సమస్యలు, సలహాలు గురించి 7382827293 నెంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని కోరారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎం తెలిపారు.
MBNR: దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పర్యటించనున్నారు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. పోతులమాడుగు గ్రామపంచాయతీ పరిధిలోని సుఖ్య తండాలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం చోలా తండా, పెద్ద తండా, లోక్య తండా, వెల్కిచర్ల గ్రామాలలో పర్యటించనున్నారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని శంభులింగేశ్వర ఆలయ వెనుక మహిళ మృతదేహాం లభ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు. మృతురాలు మండలంలోని నందికంది గ్రామానికి చెందిన సారలక్ష్మిగా గుర్తించారు. మృతురాలి తలకు గాయం ఉండడంతో ఎవరైనా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
SRD: ఉమ్మడి కరీంగనర్- మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా రామచంద్రపురంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో భరత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.
MNCL: లక్షెట్టిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను రామగుండం సీపీ శ్రీనివాస్ తనిఖీ చేశారు. గురువారం ఆయన పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బంది నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉందని తెలిపారు.
ADB: ముధోల్ నియోజకవర్గంలో గురువారం ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతోన్నాయి. ముధోల్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సందర్శించారు. పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన పోలింగ్ సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
రంగారెడ్డి: భర్తతో గొడవపడి ఓ మహిళ అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సూర్యపేట జిల్లా తుంగతుర్తికి చెందిన కె.సురేష్, జయమ్మ దంపతులు వృత్తిరిత్యా నాగోలు శ్రీనివాసకాలనీలో నివసిస్తున్నారు. అయితే, భార్యాభర్తల మధ్య ఆర్థిక విషయాల్లో ఘర్షణ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన జయమ్మ తాను చనిపోతానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
RR: గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని ఎనిమిదో వార్డులో శుభగృహ సుకృతి డిలైట్, వెళ్లే దారిలో మదన్ బార్ పక్కన గత నాలుగు రోజులుగా డ్రైనేజీ నిండి మురికి నీరు అంతా బయటకు రోడ్లపైకి రావడంతో దుర్వాసన వెదజల్లుతుంది. అటువైపుగా వెళ్లేవాళ్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని గుండ్ల పోచంపల్లి మున్సిపల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కుండ భానుచందర్ తెలిపారు.
HYD: ప్రేమపేరుతో వేధిస్తున్న ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన ఘటన ఆదిభట్ల PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. నాదరుల్లోని ఓ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బాలికను ప్రేమపేరుతో వేధిస్తూ.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది.
HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అశోక హోటల్లో బాంబు పెట్టినట్లు ఓ అగంతకుడు చేసిన కాల్ కలకలం రేపింది. మెయిన్ కంట్రోల్ నుంచి గోపాలపురం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో హోటల్ మొత్తం తనిఖీలు చేపట్టారు. హోటల్లో ఉన్న కస్టమర్లందరినీ బయటకు పంపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
NGKL: అమ్రాబాద్ మండలం దోమలపెంట ఎస్ఎల్బీసీ వద్ద ఇటీవల జరిగిన ప్రమాద స్థలాన్ని నేడు గురువారం మాజీ మంత్రి హరీష్ రావు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఉ.9 గంటలకు హాజీపూర్ చౌరస్తా వద్దకు చేరుకోవాలని కోరారు. అక్కడి నుంచి దోమలపెంట ఎస్ఎల్బీసీకి బయలుదేరనున్నట్లు వారు తెలిపారు.
ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో ఎండలు పెరుగుతున్నాయి. ఫిబ్రవరి నెల నుంచే ఎండా ప్రారంభం అవ్వగా.. జిల్లాలో 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో హైదరాబాద్ వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను ప్రజలు దృష్టిలో పెట్టుకొని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బయటకు వెళ్లినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మంచిర్యాల: జిల్లాల పరిధిలో పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. రెండు జిల్లాల్లో 108 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాల్లో పోలీస్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని, ప్రశాంత ఎన్నికలు జరగేలా అందరూ సహకరించాలని సీపీ కోరారు.
ASF: చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామంలో రూ. 21,50,890 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లుగా DSP రామానుజం తెలిపారు. ఆయన మాట్లాడుతూ..వచ్చిన సమాచారం మేరకు గూడెం గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న మద్యం దుకాణాలపై పోలీసులు సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. రూ. 21.5 లక్షల మద్యం స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.