MLC Kavitha : రాజకీయ నాయకులకు విపరీతమైన అభిమానులు ఉంటారు. తమ ప్రియతమ నేత పుట్టిన రోజు వచ్చిందంటే.. మరింత ఎక్కువ హడావిడి చేస్తూ ఉంటారు. తమదైన రీతిలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. కాగా... తాజాగా... బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేసి ఓ బీఆర్ఎస్ నేత అభిమానాన్ని చాటుకున్నాడు.
ఆస్కార్ పురస్కారం సొంతం చేసుకున్న తొలి భారతీయ సినిమా ఆర్ఆర్ఆర్. ప్రతిష్టాత్మక అవార్డు సొంతం చేసుకోవడంపై భారతదేశం ఉప్పొంగుతోంది. తెలుగు సినిమా గర్విస్తోంది. అవార్డు అందుకున్న ఆనందంలో ఆ చిత్ర బృందం ఆనందంతో ఉబ్బితబ్బిబవుతోంది. కాగా భారతదేశానికి ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో కూడా ఆస్కార్ దక్కింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీలో మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ, మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ(mlc elections) స్థానాలకు గాను పోలింగ్(polling) జరుగుతోంది. మరోవైపు తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
ఓ కబేలా బేరగాడి దౌర్జన్యానికి అభం శుభం తెలియని మూగ జీవి మృత్యువాత చెందింది. ఓ రైతు తన ఆర్థిక అవసరాల నిమిత్తం ఓ పశువుల సంతకు వెళితే.. అక్కడి వ్యాపారులు కుమ్మకై ఓ దూడ విషయంలో కర్కషంగా ప్రవర్తించి దాని మృతికి కారకులయ్యారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District)లోని కోదాడ(kodad)లో చోటుచేసుకుంది.
రిజిస్టర్ (Register)లో సంతకం చేసి లోపలికి వెళ్లాడు. వెళ్లిన వ్యక్తి ఎంతకీ బయటకు రాకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చింది. ఆయన లోపల ఎక్కడా కనిపించకపోవడంతో డిపో అంతా ఉద్యోగులు గాలించారు. ఫోన్ చేస్తే ఎత్తడం లేదు.
TSPSC నిర్వహించే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్(TSPSC Paper Leak) వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ లీక్ విషయంలో ఇద్దరికి వాటా ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు ఈ పేపర్ కోసం రూ.14 లక్షలకు డీల్ కుదుర్చుకుని మరికొంత మందికి ఈ పేపర్ అమ్మినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో 13 మందిని పోలీసులు(police) అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) పై బండి సంజయ్ (Bandi Sanjay) వ్యాఖ్యలను తాను సమర్థించను అని ఎంపీ అరవింద్(MP Arvind) అన్నారు. సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదన్నారు. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రతగా ఉండాలని హితవు పలికారు. బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాదు, అందరినీ సమన్వయం చేసే బాధ్యత అది అని అరవింద్ వెల్లడించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Kiran kumar reddy) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన బీజేపీ(BJP) కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్(Congress) పార్టీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరేందుకు కిరణ్ సిద్ధమయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీతో పాటు తెలంగాణలోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీజేపీ(BJP)లో చేరబోతున్న కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ...
స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) ఎమ్మెల్యే రాజయ్య సర్పంచి నవ్య ఇంటికి వెళ్లారు. నవ్య దంపతులకు క్షమాపణలు తెలిపారు. ఈ సందర్బంగా ఇరువర్గాల మధ్య రాజీ కుదిరినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే టి.రాజయ్య ఓ వివాదంలో చిక్కుకున్నారు. రాజయ్య గత రెండేళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచి కె.నవ్య సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే.
హైదరాబాద్లో వీధి కుక్కలు(Dogs) ప్రజల మీద ఇష్టానుసారంగా దాడులు చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి దారుణ పరిస్థితి మీద ఆర్జీవీ(RGV) గతంలో రియాక్ట్ అయ్యారు. మరోసారి దీనిపై స్పందించారు. గతంలో ఓ చిన్నారిని వీధి కుక్కలు పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో(Video) తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఆ ఘటన మీద నటులు ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. రాజకీయ నాయకుల్లో కూడా ప్రతిపక్...
సీఎం కేసీఆర్ (CM KCR) అస్వస్థతకు గురయ్యారు. ఉదయం నుంచి కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి (AIG Hospital) కుటుంబ సభ్యులు తరలించారు. ఆస్పత్రిలో సీఎంకు ప్రత్యేక వైద్య బృందం పరీక్షలు చేసింది. ఎండోస్కోపీ పరీక్షలు చేసిన వైద్యులు మరో గంటలో రిపోర్టు రానున్నట్లు తెలియవచ్చింది. అయితే జనరల్ చెకప్‌లో భాగంగానే ఆస్పత్రికి వచ్చినట్లు ఏఐజీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష పేపర్ లీక్ అంశంలో హనీ ట్రాప్ కారణమన్న విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీక్ ప్రధాన సూత్రధారి ఉద్యోగి ప్రవీణ్ కుమార్ కారణమని పోలీసులు గుర్తించారు. తెలంగాణ(Telangana) రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కలకలం రేపింది. ఒక్కరి కోసం వేలాది మంది జీవితాలతో చెలగాటం ఆడాడు ఓ ఉద్యోగి. సిస్టమ్స్‌ని హ్యాక్ చేసి, ప్రవీణ్‌క...
కేంద్రహోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఇవాళ హైదరాబాదులో (Hyderabad) సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే ఉత్సవాలో పాల్గోన్నారు. హకీంపేటలో సీఐఎస్ఎఫ్ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన సీఐఎస్ఎఫ్ (CISF) అధికారులకు అమిత్ షా రివార్డులు అందించారు. అమిత్ షా హైదరాబాదు (Hyderabad) నుంచి కొచ్చి వెళ్లాల్సి ఉండగా, ఆయన ప్రయాణించాల్సి విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.
తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) సతీమణి శోభ(Shobha) ఆదివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో శోభను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి(AIG Hospital)కి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఏఐజీ ఆస్పత్రిలో కేసీఆర్ సతీమణి శోభ(Shobha)కు వైద్య చికిత్స అందిస్తున్నారు. వైద్యపరంగా ఆమెకు చేయాల్సిన పరీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్(CM KCR), ఆయన కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha), కుటుంబీకులు ఏఐజీ ఆస్పత...
54వ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) రైజింగ్ డే వేడుకలు హైదరాబాద్లో(hyderabad) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై పరేడ్ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ సిబ్బందికి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.