HYD: NIMSలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఉచిత స్క్రీనింగ్ క్యాంపును నిర్వహిస్తోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ క్యాంపు నవంబర్ 9వ తేదీ వరకు కొనసాగుతుంది. పిల్లలలో ఉన్న లోపాలను గుర్తించి, అవసరమైన వారికి సర్జరీలు చేయనున్నట్లు NIMS డైరెక్టర్ డా. నగరి బీరప్ప, ప్లాస్టిక్ సర్జరీ HOD డా.పార్వతి తెలిపారు.