Moderate Rains:ఏప్రిల్ నెలలో తుఫానులు, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడి వర్షం కురవడంతో ఈ సారి ఎండ వేడి అంత తెలయలేదు. ఓ వారం రోజుల నుంచి భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఉదయం 7 గంటలకే వేడి ఎక్కువవడం.. బయటకు వెళ్లలేని సిచుయేషన్ నెలకొంది. హైదరాబాద్ (hyderabad).. తెలంగాణ (telangana) రాష్ట్రంలోనే కాదు.. ఏపీలో ఇంతకన్నా ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ అవుతోంది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దీంతో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వివరించింది.
తెలంగాణ ప్రజలకు (people) వాతావరణ శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. శనివారం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వ్రషాలు కురుస్తాయని తెలిపింది.
వాయవ్య దిశ నుంచి రాష్ట్రం వైపు తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వర్షం కురిసినప్పటికీ.. ఎండల ప్రభావం ఈ నెల 29వ తేదీ వరకు ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉదయం 40 నుంచి 46 డిగ్రీలు.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట తిరగొద్దు అని వాతావరణ అధికారులు సూచించారు.
రుతు పవనాలకు అనుకూల వాతావరణం ఏర్పడితే జూన్ మొదటి వారంలో (june first week) కేరళలో (kerala) వర్షాలు ప్రారంభం అవుతాయని వివరించారు. ఇటు నిన్న తిరుమల కొండపై వర్షం కురిసింది. ఉక్కపోతతో అల్లాడిన భక్తులు.. వర్షం పడటంతో కూల్ అయ్యారు. తర్వాత చల్లని గాలులు వీచాయి.