యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy)తో కలిసి మంత్రి కేటీఆర్ పర్యటించారు.హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.కేంద్రంలో తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడతది.. మన బలం లేకుండా ఎవరూ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి అక్కడ ఉండదు కేటీఆర్ (KTR) స్పష్టం చేశారు.స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన చేనేత వారోత్సవాల్లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.కేంద్ర ప్రభుత్వం ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆలిండియా పవర్ లూమ్ బోర్డు, ఆలిండియా హ్యాండిక్రాఫ్ట్ బోర్డు (Handicraft board) రద్దు చేసిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
చదవండి : గుజరాత్లో భారీ చోరీ.. 5 నిమిషాల్లో రూ.14లక్షలు దోపిడీ
హౌసింగ్ కమ్ వర్క్ షెడ్డు కార్యక్రమాన్ని కూడా రద్దు చేసింది. పనికొచ్చే పథకాన్ని ఉంచకుండా రద్దు చేసింది మోదీ ప్రభుత్వం. 75 ఏండ్లలో ఏ కేంద్ర ప్రభుత్వం చేయని తప్పు ఈ ప్రధాని చేస్తున్నారు. చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించిన దుర్మార్గమైన ప్రధాని మోదీ. మునుగోడు ఎన్నికల సందర్భంగా వేల సంఖ్యలో ఉత్తరాలు రాశాం. జీఎస్టీ (GST)ఎత్తేయాలని కోరాం. సీఎంకేసీఆర్ కూడా చండూరు వేదికగా మోదీకి అభ్యర్థించారని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ (BJP) ప్రభుత్వం అన్నింటిని అమ్ముతూ చేనేతలను ఇబ్బంది పెడుతోందని.. తెలంగాణ (Telangana) ప్రభుత్వం మాత్రం దివాలా తీసిన పోచంపల్లి చేనేత పార్క్ ను కొనుగోలు చేసిందని చెప్పారు. తమిళనాడులోని తిరుపూర్ టెక్స్ టైల్ క్లస్టర్ మాదిరి.. పోచంపల్లి (Pochampally) నేతన్నలు సమష్టిగా పని చేయాలని సూచించారు.
చదవండి : Movie teaser: ఏం చేస్తున్నావ్ టీజర్ ఎలా ఉందంటే.?

