»Mallanna Movie Will Be Shown In Malkajigiri Minister Mallareddy
Malkajigiriలో మల్లన్న సినిమా చూపిస్తా: మంత్రి మల్లారెడ్డి
మల్కాజిగిరి నియోజకవర్గంలో మల్లన్న సినిమా చూపిస్తానని మంత్రి మల్లారెడ్డి స్పష్టంచేశారు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష ఓట్ల మెజార్టీతో గెలువడం ఖాయం అని స్పష్టంచేశారు.
Ex Minister Malla Reddy Approached Telangana High Court
Minister Mallareddy: మెదక్ అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్కాజిగిరి నుంచి హన్మంతరావు, మెదక్ నుంచి అతని కుమారుడు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ కూడా బలమైన నేతకు టికెట్ ఇవ్వనుంది. మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి మల్కాజిగిరి టికెట్ ఖాయమనే వార్తలు వస్తున్నాయి.
మల్కాజిగిరి నియోజకవర్గంలో మల్లన్న సినిమా చూపిస్తా అని మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) అంటున్నారు. మంత్రి మల్లారెడ్డిపై ( Mallareddy)మైనంపల్లి కామెంట్స్ చేయడంతో ఈ మేరకు చామకూర స్పందించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి ( Mallareddy) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ భారీ ర్యాలీ తీసింది. తర్వాత జరిగిన సభ వేదికపై నుంచి మల్లారెడ్డి మాట్లాడారు. ఇక్కడి నుంచి మల్లారెడ్డి ( Mallareddy) అల్లుడు రాజశేఖర్ రెడ్డి బరిలోకి దిగుతారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధిస్తారని మల్లారెడ్డి అన్నారు.
కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు దక్కే పరిస్థితి లేదని మల్లారెడ్డి ( Mallareddy) చెబుతున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో మల్లన్న సినిమా చూపించడం ఖాయం అంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది ట్రైలర్ మాత్రమేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో గుండాలు, రౌడీలు, కబ్జాకోరులు ఉన్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అలాంటి నేతలను తరిమి కొట్టాలని జనాలను కోరారు.
మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని హైకమాండ్‌ను కోరారు. మెదక్ అసెంబ్లీ సీటు కోసం బెట్టుచేశారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఉండటంతో టికెట్ ఇవ్వడం వీలు కాలేదు. అప్పటినుంచి మంత్రి హరీశ్ రావు లక్ష్యంగా విమర్శలు చేశారు. చివరకు పార్టీని వీడారు. బీజేపీలో చేరతారని ఊహాగానాలు వచ్చినప్పటికీ.. అంతకుముందు బండి సంజయ్‌పై కామెంట్స్ చేసిన నేపథ్యంలో అటువైపు అడుగులు వేయలేదు. చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు.