సీఎం కేసీఆర్ (CM KCR) రెండుచోట్ల ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. ఓటమి భయంతోనే తన నియోజకవర్గానికి వస్తున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ (BRS) అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ..పోటీ చేసేందుకు కామారెడ్డికి ఎందుకు వస్తున్నాడో తనకు తెలియదన్నారు. కామారెడ్డి(Kamareddy)లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. తమ పార్టీ అధిష్ఠానం తనకు టిక్కెట్ ఇస్తే కేసీఆర్‌పై గెలుస్తానన్నారు. కామారెడ్డిలో తాను లోకల్ అన్నారు.
గజ్వేల్‌పై నమ్మకం లేకే రెండో స్థానంలో కూడా ఆయన పోటీ చేస్తున్నారని అన్నారు. కామారెడ్డి అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేసిందేమి లేదన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) మైనార్టీ డిక్లరేషన్ కమిటీ వేశారు. ఆ కమిటీకి చైర్మన్ గా నన్ను వేశారు. ఇవ్వాళ కమిటీ సభ్యులతో డిక్లరేషన్ పై చర్చించాం. ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ సెక్రటరీలు కూడా హాజరయ్యారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ (Congress) ఇచ్చింది. కేసీఆర్ 12 శాతం రిజర్వేషన్ చేస్తామని చెప్పి చెయ్యలేదు. కనీసం మైనార్టీ విభాగాన్ని బలోపేతం చెయ్యలేదు. అధికారులు కూడా లేక నిర్వీర్యం అవుతోంది. ముస్లిం డెవలప్ మెంట్, వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణ కోసం ఏం చెయ్యాలని డిస్కస్ చేశాం. కమిటీలో కొన్ని వినతిపత్రాలు వచ్చాయిని ఆయన అన్నారు. వాటిపై మరోసారి డిస్కస్ (Discus) చేస్తాం” అని షబ్బీర్ అలీ అన్నారు.