»Kadiam Srihari Made Emotional Comments On Party Workers
Kadiam Srihari: అవకాశం వస్తే.. మీ ఆశీస్సులు కావాలి, కార్యకర్తలతో మాజీ డిప్యూటీ సీఎం
స్టేషన్ ఘనపూర్ కార్యకర్తలు, ప్రజలు ఆశీస్సులు తనకు కావాలని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు.
Kadiam Srihari Made Emotional Comments On Party Workers
Kadiam Srihari: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తోంది. అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మెజార్టీ సిట్టింగులకే ఛాన్స్ ఉండగా.. కాంట్రవర్సీ ఉన్న చోట మాత్రం మార్పులకు అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, స్టేషన్ ఘనపూర్, జనగామ ఇతర చోట్ల అభ్యర్థులను మార్చే ఆస్కారం ఉంది.
స్టేషన్ ఘనపూర్ నుంచి రాజయ్య (rajaiah) ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి ఆయన టికెట్ ఆశిస్తున్నారు. అతని పట్ల హై కమాండ్ మంచి అభిప్రాయంతో లేదని తెలిసింది. ఇక్కడి నుంచి కడియం శ్రీహరిని (Kadiam Srihari) బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల కడియం- రాజయ్య మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు కార్యక్రతలతో కడియం శ్రీహరి (Kadiam Srihari) సమావేశం అయ్యారు. తన సొంత ఇంటికి వచ్చిన భావన కలుగుతోందని చెప్పారు.
కార్యకర్తలకు, ప్రజలకు తలవొంపులు తెచ్చే పరిస్థితిని ఏనాడు కల్పించలేదని చెప్పారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని వివరించారు. డెవలప్ చేయాలని చూశానే తప్ప.. తప్పుడు పనులు చేయలేదన్నారు. ఇక్కడి ప్రజలు పెట్టిన భిక్ష వల్లే ఈ స్థాయిలో ఉన్నానని వివరించారు. వచ్చే ఎన్నికల్లో మార్పులకు అవకాశం ఉందన్నారు. తనకు అవకాశం వస్తే అందరూ ఆశీస్సులు అందించాలని కడియం శ్రీహరి (Kadiam Srihari) విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లూ మీరు ఎమ్మెల్యే ఎవరంటే సిగ్గుపడే పరిస్థితి.. కానీ తాను అలా చేయనివనని.. తల ఎత్తేలా చేస్తానని చెప్పారు.