»Huge Opportunities For Innovation In Telangana Minister Ktr
KTR : తెలంగాణలో ఇన్నోవేషన్‌కు అపార అవకాశాలు : మంత్రి కేటీఆర్
ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణను(Telangana) కేంద్రంగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యమని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు.ఆరోగ్య రక్షణ సదస్సు ‘బయె ఆసియా( Bio Asia) –2023’ హెచ్ఐసీసీలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది.మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును మంత్రి కేటీఆర్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన ప్రముఖులతో కలిసి ప్రారంభించారు.
ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగానికి తెలంగాణను(Telangana) కేంద్రంగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యమని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు.ఆరోగ్య రక్షణ సదస్సు ‘బయె ఆసియా( Bio Asia) –2023’ హెచ్ఐసీసీలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది.మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సును మంత్రి కేటీఆర్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలకు చెందిన ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ పరిశ్రమ విలువ 2030 నాటికి 250 బిలియన్ డాలర్లను దాటుతుందని భావిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. అందుకు నాలుగు అంశాలను మూల స్తంభాలుగా ఎంచుకున్నామన్నారు. వాటి సాయంతో లైఫ్ సైన్సెస్ (Life Science) రంగానికి కొత్త రూపు ఇస్తామని మంత్రి ప్రకటించారు. భారత ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతం హైదరాబాద్(Hyderabad)లోని లైఫ్‌సైన్సెస్ కంపెనీలు వినూత్న, జెనరిక్ ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్ (Dr. Reddy’s) లేబొరేటరీస్, బయోలాజికల్–ఈ, భారత్ బయోటెక్, (Bharat Biotech) శాంతా బయోటెక్, అరబిందో, హెటెరో, గ్లాండ్ ఫార్మా, విర్చో బయోటెక్ వంటి కీలక సంస్థలు ఇక్కడ ఉండటంతో.. జీవ ఔషధాల ఉత్పత్తిలో దేశంలోనే హైదరాబాద్ (Hyderabad) అగ్రగామిగా ఉంది. దేశంలోనే తొలిసారిగా ఏర్పాటయ్యే బయో ఫార్మాహబ్ (బీ హబ్), హైదరాబాద్ ఫార్మాసిటీలతో తమ సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
కణ, జన్యు చికిత్సల రంగంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు కొత్త తరహా నివారణ, చికిత్సల వాణిజ్యీకరణ లక్ష్యంతో హైదరాబాద్‌లో ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యూరేటివ్ మెడిసిన్’ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆసియాలో ఔషధ ఆవిష్కరణ, అభివృద్ధి సేవలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో.. లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతులు జీనోమ్ వ్యాలీలో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రముఖ విద్యా, పరిశోధన సంస్థలతోపాటు మానవ వనరులు, ఔషధ రసాయన శాస్త్రం, డిస్కవరీ బయాలజీ, ప్రీ–క్లినికల్, క్లినికల్, డ్రగ్ డెవలప్మెంట్, క్లినికల్ ట్రయల్ ప్రొడక్ట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ సహా వివిధ సేవలు అందించే భారతీయ, బహుళజాతి ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ సర్వీస్ ఆర్గనైజేషన్లకు హైదరాబాద్ నిలయంగా ఉంది. తెలంగాణ(Telangana) రాష్ట్రం అపార అవకాశాలు, నైపుణ్యాలకు కేంద్రమని నరసింహన్(Narasimhan) తెలిపారు. భారతదేశంలో, తెలంగాణలో పెట్టుబడులు కొనసాగించాలని సూచించారు. ‘తెలంగాణలో ముఖ్యంగా ఇన్నోవేషన్‌కు అపార అవకాశాలున్నాయి. ఈ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుదని తెలిపారు. ఔషధ, లైఫ్‌సైన్సెస్ రంగంలో అవకాశాల గుర్తింపునకు బయో ఏషియా ( Bio Asia)సదస్సు మంచి వేదిక. మంత్రి కేటీఆర్ సహకారం లేకుండా ఇంతపెద్ద కార్యక్రమం సాధ్యం కాదు’ అని పేర్కొన్నారు. నాణ్యమైన జీవన ప్రమాణా ల కోసం ఔషధాల ఆవిష్కరణ ఎంతో అవసరమని చెప్పారు. పరిశోధన, సాంకేతికత అభివృద్ధితో అనేక వ్యాధులకు కొత్త ఔషధాలు, వైద్య విధానాలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. నూతన ఆవిష్కరణల ఫలితంగా నేడు అత్యంత ప్రమాదకర కార్డియో వాస్కులర్ వ్యాధికి మెరుగైన ఔషధాలు అందుబాటుకి వచ్చాయని.. మలేరియా,(Malaria) కుష్టు వంటి మొండి వ్యాధులు కూడా పూర్తిగా నయమవుతున్నాయని ఆయన వివరించారు.