»From Today Cm Revanth Reddy Prajadarbar Discussion On Key Issues
Telangana: నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్..కీలక అంశాలపై చర్చ
నేటి నుంచి ప్రజాదర్బార్ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించనున్నారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించనున్నట్లు తెలిపారు. అలాగే 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి కూడా సమీక్షలు నిర్వహించనున్నారు.
తెలంగాణ (Telangana) నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నారు. కాంగ్రెస్ కొత్త సర్కార్ తాము ఇచ్చిన హామీలపైనే ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలుపై కార్యాచరణను మొదలు పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజా దర్బార్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు నేటి నుంచి ప్రజాదర్బార్ నిర్వహించనుంది.
హైదరాబాద్లోని జ్యోతిబాపూలే ప్రజాభవన్లో ప్రజల నుంచి అర్జీలను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి నేరుగా సీఎం రేవంత్రెడ్డి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు పరిష్కరించనున్నారు. ప్రజాదర్బార్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొని ప్రజల సమస్యలను పరిష్కరించనున్నట్లు తెలిపారు. నేరుగా ప్రజా సమస్యలు విని వీలైనంత త్వరగా వారి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మరోవైపు కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇప్పటికే రెండు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. నేటి సమావేశంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు విషయాలపై చర్చించనున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో విద్యుత్ స్థితిగతులపై కూడా సమావేశం నిర్వహించి పలు చర్యలు తీసుకోనున్నారు.