»From That Day Traffic On The Durgam Lake Cable Bridge Will Be Closed
Cable Bridge : ఆ రోజు నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్.. !
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని దుర్గం చెరువు తీగల వంతెనపై నుంచి వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) ఆంక్షలు విధించారు. ఈ నెల 6న నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూడు రోజులపాటు వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. దుర్గం చెరువు(Durga Lake) కేబుల్ సిస్టమ్ పనుల తనిఖీలో భాగంగా వంతెనపై భారీ క్రేన్‌ను ఉంచాల్సి రావడంతో ట్రాఫిక్‌ను మూసివేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్(DS Lokesh Kumar) వెల్లడించారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని దుర్గం చెరువు తీగల వంతెనపై నుంచి వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) ఆంక్షలు విధించారు. ఈ నెల 6న నుంచి 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూడు రోజులపాటు వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. దుర్గం చెరువు(Durga Lake) కేబుల్ సిస్టమ్ పనుల తనిఖీలో భాగంగా వంతెనపై భారీ క్రేన్‌ను ఉంచాల్సి రావడంతో ట్రాఫిక్‌ను మూసివేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్(DS Lokesh Kumar) వెల్లడించారు. కాగా, రాకపోకలు నిలిచిపోయే ఆ నాలుగు రోజులపాటు ట్రాఫిక్‌ను వివిధ మార్గాల్లో మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రోడ్ నం.45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి (Gachibowli) వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. అలాగే ఐకియా రోటరీ నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్ (Jubilee Hills)వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైతం రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లి సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలు కొనసాగించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. జూబ్లీహిల్స్ నుంచి ఐక్య వైపు వెళ్లే వాహనదారులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (Ambedkar Open University) మీదుగా వెళ్లాలని సూచించారు. ఐక్య నుంచి జూబ్లీహిల్స్ వచ్చే వాహనాలు ఇన్ ఆర్బిట్ మాల్, దుర్గం చెరువు, మాదాపూర్ (Madapur) నుంచి డైవర్షన్ తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు.