JN: పాలకుర్తి మండలం దర్థపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు తడిశెట్టి శ్రీనివాస్ స్వంత గూటికి చేరుకున్నారు. ఇటీవల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన ఆయన తిరిగి కాంగ్రెస్లో సోమవారం చేరారు. కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం, ఎమ్మెల్యే అభివృద్ధి పట్ల కట్టుబాటు, ప్రజలతో అనుబంధం చూసి తాను కాంగ్రెస్లో చేరానన్నారు.