మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, పోలీస్ అధికారులు, సిబ్బంది, పోలీసుల కుటుంబసభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు బతుకమ్మలు పేర్చగా, అందరూ కలిసి సంతోషంగా బతుకమ్మ ఆడారు. అలాగే ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.