KMM: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం దేవాదాయ శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి రామాలయం అభివృద్ధి పనులకు వేగం పెంచాలని, ఆలయ విస్తరణ, ప్రాకార నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.