సిరిసిల్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్ సహకారంతో శుక్రవారం హరితాన్ ఇకో హ్యాక్తాన్- 2025 సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టీ. శంకర్ అధ్యక్షత వహించగా, నిపుణులు కే సురేష్, ప్రొఫెసర్ టీ. వేణుగోపాల్ ఈ – వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించారు. 15 మంది విద్యార్థులు ఈ – వ్యర్థాల నిర్వహణపై ప్రజెంటేషన్లు ఇచ్చారు.