»Ec Meeting October 5th 2023 Traffic Jam Alert In Madhapur Area
EC meeting: మాదాపూర్ పరిధిలో ట్రాఫిక్ జాం అలర్ట్
హైదరాబాద్ మాదాపూర్లో నేడు ఈసీ సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ అడ్వైజరీని పోలీసులు జారీ చేశారు. లెమన్ ట్రీ హోటల్ నుంచి సీఐఐ, కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా రోటరీ, ఐకియా రోటేటరీ నుంచి సైబర్ టవర్స్, కొత్తగూడ నుంచి హైటెక్స్ మధ్య ఉన్న కార్యాలయాలకు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయా మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు.
EC meeting october 5th 2023 Traffic jam alert in Madhapur area
నేడు హైదరాబాద్(hyderabad) మాదాపూర్(Madhapur)లోని టెక్ మహీంద్రాలో భారత ఎన్నికల సంఘం సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్థానికులకు ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉన్నాతాధికారులు ఈ సమావేశానికి హాజరవుతున్నందున ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు ఈ వేదిక చుట్టూ ఉన్న రోడ్లు, పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ క్రమంలో లెమన్ ట్రీ హోటల్ నుంచి సిఐఐ, కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా రోటరీ, ఐకియా రోటేటరీ నుంచి సైబర్ టవర్స్, కొత్తగూడ నుంచి హైటెక్స్ మధ్య ఉన్న కార్యాలయాలు, ఈ ప్రాంతం చుట్టూ కొన్ని ట్రాఫిక్ నిబంధనలు ఉంటాయని తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఇతర రూట్లలో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అందువల్ల ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు తగిన ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(police) ప్రయాణికులకు సూచించారు. ప్రయాణికులు సలహాను పాటించాలని, ట్రాఫిక్ సజావుగా ఉండేలా ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.