ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛ, న్యాయబద్ద నిర్వహణకు అన్ని చర్యలు చేపట్టాలని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామరావు అన్నారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్తో కలిసి పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని వారికి సూచించారు.