సిద్దిపేట జిల్లా దుబ్బాక( Dubbaka) నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తీవ్రమైన కన్య్పూజన్ నెలకొని ఉన్నది. నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా కొనసాగుతున్న(Cherukusrinivas Reddy) చెరుకుశ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఆత్మగౌరవ పేరుతో పిబ్రవరి 1 నుంచి ఊరూరు తిరుగుతున్నారు. మరో కాంగ్రెస్ నాయకుడుశ్రావణ్ కుమార్ రెడ్డి (Jodoyatra) జోడోయాత్ర పేరుతో అక్కడక్కడ తిరుగుతున్నారు. వీళ్లద్దరితో సంబంధం లేకుండా ఇప్పుడు (Katti kārtīka) కత్తి కార్తీక జోడో యాత్రకు సిద్దమయ్యారు. దుబ్బాకలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకున్న ఆమె యాత్ర పేరుతో ఊరూరు పాదయాత్ర చేయనున్నట్లు చెబుతున్నారు. లీడర్ల యాత్రలు బాగానే ఉన్నప్పటికీ ఎవరి వెంట నడవాలో తెలియక కార్యకర్తలు జుట్టుపీక్కుంటున్నారు. దుబ్బాక కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది….
రాష్ట్ర స్థాయిలో పీసీసీ నుంచి మొదలుకుని కింది స్థాయి వరకు (Congress party) కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తీవ్రమైన కన్య్పూజన్ నెలకొని ఉన్నది. ఎవరి గ్రూపులు వారివే, ఎవరి ప్రచారాలు వారివే అన్నట్లుగా కనిపిస్తున్నాయి. సరైన నాయకత్వం లేకపోవడంతో నియోజకవర్గ స్థాయిలో లీడర్లు ఎవరికి వారే అధిష్టానం వద్ద తనకే గుర్తింపు ఉన్నదని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ముగిసిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు (Hath se hath) హాథ్ సే హాథ్ జోడో యాత్ర లేదా మరో పేరుతో పాదయాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యాత్రలు కొన్ని చోట్ల కార్యకర్తలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి..దుబ్బాక ప్రజానీకానీకి కత్తి కార్తీక అంటే బాగా తెలుసు. యాంకర్ అయిన కార్తీక గతంలో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే. తాను దుబ్బాక కేంద్రంగానే రాజకీయం చేస్తున్నారు. ఓ సారి ఓటమి చెందిన తరువాత ఇక దుబ్బాక వైపు రారేమో అనుకున్నారు. ఆమె మాత్రం దుబ్బాకపైనే ప్రధాన దృష్టి సారించారు. ఇప్పుడు కార్తీక కూడా నియోజకవర్గంలో జోడోయాత్ర మొదలు పెట్టడానికి సిద్ధం అయ్యారు. ఇందుకోసం దుబ్బాకలోనే ఓ ఇల్లును అద్దెకు తీసుకున్నారు. స్థానికంగా ఉండడం లేదనే కార్యకర్తలు ప్రశ్నించకుండా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ నెల 12 నుంచి కార్తీక యాత్ర మొదలుపెట్టనున్నట్లు చెబుతున్నారు.
చెరుకు శ్రీనివాస్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, కత్తి కార్తీక..ముగ్గురూ ఎవరికి వారే దుబ్బాకలో రాజకీయం చేసుకుంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిలకు మద్య పచ్చగడ్డి వస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. శ్రావణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ (Covert ) కోవర్టు అని, ఆయన ఎప్పుడు చూసిన (Minister Harish Rao) మంత్రి హరీష్ రావు ఇంట్లోనే ఉంటారని మీడియా ముందు శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎవరి బాట వారిదే అన్నట్లుగా వారు ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర స్థాయిలోని కాంగ్రెస్ పెద్దలు కూడా ఒకరికి ఓ వర్గం, మరొకరికి మరో వర్గం సపోర్ట్ చేస్తున్నది. ఇదిలా ఉండగా కత్తికార్తీక కూడా ఇద్దరితో ఏ మాత్రం సంబంధం లేకుండానే తాను నమ్ముకున్న కొందరు పార్టీ నాయకులు, కార్యకర్తలతో రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు పాదయాత్రకు కూడా సిద్దం అయ్యారు. కాగా రాహుల్ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ మొత్తం యాత్రలో మొదటి నుంచి చివరి వరకు కత్తి కార్తీక పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీలోని డిల్లీ నుంచి పీసీసీ వరకు ముఖ్య నాయకులందరితో పరిచయాలున్నాయి. అయితే అమె చేపట్టనున్న పాదయాత్రకు ఏ మేరకు స్పందన వస్తుందో వేచి చూడాల్సి ఉన్నది.