ADB: గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం అవసరమని నూతన సర్పంచులు పేర్కొన్నారు. శనివారం వారు ఎంపీడీవో, ఎంపీవోలను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ ఫలాలు సక్రమంగా చేరాలంటే కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పరమేశ్వర్, తదితరులు ఉన్నారు.

