BDK: రాష్ట్రంలో తరచుగా గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అవ్వడం బాధాకరమైన విషయం అని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తెలిపారు. ఫుడ్ పాయిజన్ వెనుక ముమ్మాటికి బీఆర్ఎస్ హస్తం ఉందని ఆరోపణలు చేశారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమై గురుకుల పాఠశాలలను సందర్శించి, విద్యార్థుల తిండి విషయంపై శ్రద్ధ తీసుకుంటూ ఉండాలని పేర్కొన్నారు.