GDWL: గద్వాల జిల్లాలోని 713 అంగన్వాడీ కేంద్రాల్లో 3-5 ఏళ్ల పిల్లలకు ఆటపాటలతో కూడిన బోధన, పోషకాహారం అందిస్తున్నారు. అయితే చాలా కేంద్రాలు అద్దె భవనాల్లో, మరికొన్ని సొంత భవనాల్లో విద్యుత్, ఫ్యాన్లు లేకుండా నిర్వహిస్తున్నారు. దీంతో పిల్లలతో పాటు గర్భిణులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.