SRD: ఆశా కార్మికులకు నెలకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో యూనియన్ సమావేశం శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ఆశా వర్కర్లు విధులు నిర్వహించిన గుర్తింపు దక్కడం లేదని చెప్పారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు.