NZB: ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరికి తీవ్రగాయాలైన ఘటన సారంగాపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి నిజామాబాద్ నుంచి బోధన్ వైపు వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. క్షతగాత్రుడిని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.