KMM: ప్రజల ఆరోగ్యం పట్ల సీపీఎం పార్టీ శ్రద్ధ వహిస్తుందని ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి ఉరడీ సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం తమ్మినేని సుబ్బయ్య భవన్లో ఉచిత మెడికల్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు అనారోగ్యంతో బాధపడే వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం డివిజన్ నాయకులు పాల్గొన్నారు.