నిజామాబాద్: రెంజల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు వృద్ధులు ధర్నా నిర్వహించారు. పింఛన్ నగదును ఆలస్యంగా పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ ధర్నా నిర్వహించారు. ఇతర గ్రామాలలో పింఛన్ పంపిణీ చేస్తూ రెంజల్లో ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. అనంతరం ఎంపీడీవో వెంకటేష్ మాట్లాడుతూ.. సకాలంలో పింఛన్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో వృద్ధులు వెనుదిరిగి వెళ్లిపోయారు.