SRPT: యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోతే మండలం సర్వారం గ్రామంలోని PACS ఎదుట రైతులు ఉదయం ఏడు గంటల నుంచి పడి కాపులు కాస్తున్నారు. రైతులకు కావాల్సినంత యూరియా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. వెంటనే వ్యవసాయ అధికారులు స్పందించి రైతులకు కావాల్సినంత యూరియాను అందుబాటులో ఉంచాలని రైతులు అధికారులను కోరుతున్నారు.