KNR: జిల్లాలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పూర్వవిద్యార్థిని మాసిపెద్ది సుప్రీత స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ఎసి) పరీక్ష ద్వారా సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)గా ఎంపికయ్యారు. తద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి BSFలో చేరిన మొదటి మహిళ సుప్రీత. ఈమె గోదావరిఖని కోల్ బెల్ట్ శాంతినగర్ కు చెందినవారు.