MNCL: జన్నారం మండలంలోని గ్రామాలలో 145 పనులకు శ్రీకారం చుట్టనున్నామని జన్నారం ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. మండలంలోని 29 గ్రామ పంచాయతీల పరిధిలో ఎమ్మెల్యే బొజ్జు ఆధ్వర్యంలో ఉపాధి పనుల జాతర భాగంలో భాగంగా వివిధ పనులతో పాటు అంగన్వాడి భవనాల నిర్మాణం పనులను శుక్రవారం నుండి ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. ఆయా కార్యక్రమాలను అందరూ జయప్రదం చేయాలని ఆయన కోరారు.