»Bandi Sanjay Alleges On Kcr Economically Helps To Congress Jds In Elections
Karnatakaలో కాంగ్రెస్, జేడీఎస్ కు సీఎం కేసీఆర్ పైసల్ ఇచ్చారు: బండి సంజయ్
కర్ణాటక ఎన్నికలకు తెలంగాణకు సంబంధం లేదు. అక్కడ మా పార్టీకి ఓటు శాతం తగ్గలేదు. జేడీఎస్ ఓట్లను బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ కు మళ్లించారు. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడులో కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కలేదు. అలాంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఎలా ప్రత్యామ్నాయం అవుతుంది?’
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ లకు తెలంగాణ సీఎం కేసీఆర్ (K Chandrasekhar Rao) డబ్బులు పంపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని.. కర్ణాటకలో కేసీఆర్ సహకరించడంతోనే తమ పార్టీ ఓడిపోయిందని తెలిపారు. తెలంగాణను బీఆర్ఎస్ (BRS Party) సర్వనాశనం చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
హైదరాబాద్ (Hyderabad) లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను సోమవారం ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ‘మా పార్టీ ఎదుగుదలను ఓర్వలేకే సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ (JDS)కు ఆయన నిధులు సమకూర్చారు. కాంగ్రెస్ (Congress)కు ఓటు వేస్తే బీఆర్ఎస్ పార్టీకి వేసినట్లే. కర్ణాటక ఎన్నికలకు తెలంగాణకు సంబంధం లేదు. అక్కడ మా పార్టీకి ఓటు శాతం తగ్గలేదు. జేడీఎస్ ఓట్లను (Votes) బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ కు మళ్లించారు. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడులో కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కలేదు. అలాంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఎలా ప్రత్యామ్నాయం అవుతుంది?’ అని సంజయ్ ప్రశ్నించారు.
ఇక పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని సంజయ్ ప్రకటించారు. ఈనెల 30 నుంచి జూన్ 30 వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మోదీ విజయాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. గ్రామీణ సడక్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం రోడ్లు (Roads) వేస్తోందని సంజయ్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్ మెంట్, పేదలకు ఇళ్ల నిర్మాణం, 2 లక్షల ఉద్యోగాలు (Jobs) భర్తీ చేస్తామని సంజయ్ తెలిపారు.