NLG: కనగల్ మండలం ఇస్లాం నగర్ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్లు శుక్రవారం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డిని పట్టణంలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. కిషన్ రెడ్డి వారిని శాలువాతో ఘనంగా సన్మానించి, అభినందనలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎస్కే లతీఫ్, అలుగుబెల్లి సైదిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.