RR: ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల ప్రజలకు డిపో మేనేజర్ వెంకట నర్సప్ప శుభవార్త తెలిపారు. శ్రీశైలంలో డ్యాం గేట్లు తెరిచినందుకు IBP నుంచి మెట్రో డీలక్స్‌లో కేవలం రూ.1000తో ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చారు. ఉ.5గం.కు బయలుదేరి శ్రీశైలం డ్యాం, శ్రీశైల మల్లికార్జునస్వామి దర్శనం తిరిగి ఉమామహేశ్వరం దర్శనం చేయిస్తారు. అదే రోజు రాత్రి 10 గంటలకు IBP చేరుకుంటుందని తెలిపారు.