WNP: గర్భిణీలకు, పిల్లలకు ఏ సమయంలో ఏ వ్యాక్సిన్ ఇవ్వాలో వాటి సమయానుసారంగా వ్యాక్సిన్ ఇస్తే ఆరోగ్యవంతమైన యువతను తయారు చేయవచ్చని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం వనపర్తి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ద్వారా గద్వాల, వనపర్తి జిల్లాల వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు హాజరయ్యారు.